Cyclone Fengal Effect :ఫెంజల్ తుపాను ఎఫెక్ట్.. పుదుచ్చేరిలో గత 30 ఏళ్లలో ఇవే అత్యధిక వర్షాలు
- Cyclone Fengal Effect : బంగాళాఖాతంలో గత రాత్రి ఫెంజల్ తుపాను మహాబలిపురం- పుదుచ్చేరి మధ్య తీరం దాటింది. దీని కారణంగా పుదుచ్చేరిలో అత్యధికంగా 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
- Cyclone Fengal Effect : బంగాళాఖాతంలో గత రాత్రి ఫెంజల్ తుపాను మహాబలిపురం- పుదుచ్చేరి మధ్య తీరం దాటింది. దీని కారణంగా పుదుచ్చేరిలో అత్యధికంగా 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
(1 / 6)
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి. నివాస ప్రాంతాలు, వీధులు నీట మునిగాయి. దీంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది.
(2 / 6)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడింది. నిన్న మహాబలిపురం, పుదుచ్చేరి మధ్య తీరం దాటింది. గత రాత్రి ఈ తుపాను కారణంగా కడలూరు, పుదుచ్చేరి తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
(3 / 6)
ఈదురుగాలుల ధాటికి పుదుచ్చేరిలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. పుదుచ్చేరి గతంలో ఎన్నడూ లేనంతగా కురిశాయి వర్షాలు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా ఉంది పుదుచ్చేరి. సహాయక చర్యల కోసం భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.
(4 / 6)
నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన వరద కారణంగా వాహనాలన్నీ నీటిలో మునిగిపోయాయి. దీని వల్ల చాలా మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఫెంజల్ తుపాను కారణంగా వర్షాలు, కొండచరియలు విరిగిపడ్డాయి.
(5 / 6)
పుదుచ్చేరిలో కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం నీట మునిగింది. 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
ఇతర గ్యాలరీలు