iPhone SE 4 Price: ఐఫోన్ ఎస్ఈ 4 ధర ఇంత ఉండనుందా? స్పెసిఫికేషన్లు ఇలా!
iPhone SE 4 Price: ఐఫోన్ ఎస్ఈ 4 ధర ఎంత ఉండనుందో తాజాగా లీకుల ద్వారా సమాచారం బయటికి వచ్చింది. గత మోడల్‍తో పోలిస్తే చాలా అప్‍గ్రేడ్లతో ఈ మొబైల్ రానుంది. ఆ వివరాలు ఇవే.
(1 / 7)
‘ఐఫోన్ ఎస్ఈ 4’కి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఎస్ఈ 3కి రెండేళ్ల తర్వాత ఈ అప్‍గ్రేడెడ్ మోడల్ రానుండటంతో ఆసక్తి విపరీతంగా ఉంది. గత మోడల్‍తో పోలిస్తే అప్‍గ్రేడ్లు, ఏఐ ఫీచర్లతో ఈ ఐఫోన్ ఎస్ఈ 4 ఉండనుందని లీకుల ద్వారా వెల్లడైంది. (Apple)
(2 / 7)
ఐఫోన్ ఎస్ఈ 4 ధర ఎంత ఉంటుందో తాజాగా సమాచారం లీకైంది. ఈ మొబైల్ ప్రారంభ ధర 499 డాలర్లు (సుమారు రూ.41,950)గా ఉంటుందని తెలుస్తోంది. అడ్వాన్స్ ఫీచర్లతో ఈ ధరతో వస్తే ఈ మోడల్‍కు మంచి డిమాండ్ కనపడే ఛాన్స్ పుష్కలంగా ఉంది. (AFP)
(3 / 7)
వచ్చే ఏడాది మార్చిలోగానే ఐఫోన్ ఎస్ఈ 4ను యాపిల్ లాంచ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మోడల్ ప్రొడక్షన్ కూడా మొదలైందని తెలుస్తోంది. (Bloomberg)
(4 / 7)
ఎస్ఈ 3తో పోలిస్తే డిజైన్‍లో అప్‍గ్రేడ్‍తో ఐఫోన్ ఎస్ఈ 4 రానుంది. 6.1 ఇంచుల ఓఎల్ఈడీ డిస్‍ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్ ఉండనున్నాయి. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉండొచ్చు. వెనుక సింగిల్ కెమెరానే ఉంటుందని తెలుస్తోంది. (Apple)
(6 / 7)
ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్ బయోనిక్ ఏ18 ప్రాసెసర్‌తో రానుందని లీకుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఏఐ ఫీచర్లు ఉండే యాపిల్ ఇంటెలిజెన్స్ ఈ మొబైల్‍లో ఉంటుంది.(Apple)
ఇతర గ్యాలరీలు