తెలుగు న్యూస్ / ఫోటో /
Healthy Foods: మెదడు పనితీరును, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచగల ఆహారాలు ఇవి
- మెదడు ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. పోషకాలు ఎక్కువగా ఉండే కొన్ని ఫుడ్స్ మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాంటి 5 రకాల ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి.
- మెదడు ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. పోషకాలు ఎక్కువగా ఉండే కొన్ని ఫుడ్స్ మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాంటి 5 రకాల ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి.
(1 / 6)
మనం తినే ఆహారం నేరుగా మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే నిత్యం పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోవడం ముఖ్యం. పోషకాలు ఉండే ఆహారాలు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని, మానసిక ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మెదడు పనితీరును మెరుగుపరచగల ఐదు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి. (Photo by Neuroscience News)
(2 / 6)
బ్రకోలీ, పాలకూర, బీట్‍రూట్, ఉల్లిపాయలు, టమాటాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. (Shutterstock)
(3 / 6)
యాపిల్, ఆరెంజ్, దానిమ్మ పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని కూడా పెంచగలవు. వీటిలో షుగర్ కంటెంట్ కూడా తక్కువగానే ఉంటుంది. చర్మానికి కూడా ఈ పండ్లు మంచివి. (Unsplash)
(4 / 6)
సాల్మన్, సార్డినెస్ చేపలు, యగర్ట్, కోడిగుడ్లలో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఉంటాయి. ఇవి రెగ్యులర్‌గా తినడం వల్ల కూడా మెదడు, మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. (Unsplash)
(5 / 6)
అవిసె, చియా, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలతో పాటు వాల్‍నట్స్, బాదంల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. (Unsplash)
ఇతర గ్యాలరీలు