Renaming monkeypox: ‘మంకీ పాక్స్’ పేరు మార్పు
Renaming monkeypox: ఆఫ్రికా, యూరోప్, అమెరికా దేశాలను వణికించిన మంకీ పాక్స్(monkeypox) పేరును మార్చే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు ప్రారంభించింది.
Renaming monkeypox: మంకీ పాక్స్(monkeypox) పేరును మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తోంది. మంకీ పాక్స్ పేరుపై విమర్శలు రావడం, అది కొంతవరకు వివక్షకు కారణమవడంతో ఈ వైరస్ పేరును మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే నిర్ణయించింది. అయితే, ఆ ప్రక్రియను త్వరగా ముగించాలని యూఎస్ కోరుతోంది.
Monkeypox is to be called MPOX: మంకీ పాక్స్ కాదు.. ఇకపై ఎంపాక్స్(MPOX)
మంకీ పాక్స్ పేరును ఎంపాక్స్(MPOX) గా మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization -WHO) నిర్ణయించింది. త్వరలో ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది. తమ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంకీ పాక్స్ పేరు ప్రతికూల ప్రభావం చూపుతోందని, అందువల్ల ఆ పేరును మార్చాలని అమెరికా చాన్నాళ్లుగా కోరుతోంది. పేరు మార్పు వల్ల వివక్ష తొలగుతుందని భావిస్తున్నారు.
High threat in America: మే నెల నుంచి..
ఈ సంవత్సరం మే నెల నుంచి మంకీ పాక్స్ కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 30 వేల వరకు మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం మరితం తీవ్రంగా ఉంది. స్వలింగ సంపర్కం, ముఖ్యంగా ఈ వైరస్ సోకిన వారితో శృంగారం చేసినవారికి ఈ వైరస్ సోకుతుంది. WHO అధ్యయనం ప్రకారం.. ఈ వైరస్ ముప్పు అమెరికాలో అత్యధికంగా, యూరోప్ దేశాల్లో అత్యధికం నుంచి మధ్యస్థం మధ్య, ఆఫ్రికా, తూర్పు మధ్యదరా ప్రాంతం, ఆగ్నేయ ఆసియా దేశాల్లో తక్కువగా ఉంది.