Abortion rights: అవివాహితైనా సరే.. 24 వారాల్లోపు గర్భస్రావానికి సుప్రీం అనుమతి-unmarried woman can undergo abortion up to 24 weeks says supreme court judgement ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Abortion Rights: అవివాహితైనా సరే.. 24 వారాల్లోపు గర్భస్రావానికి సుప్రీం అనుమతి

Abortion rights: అవివాహితైనా సరే.. 24 వారాల్లోపు గర్భస్రావానికి సుప్రీం అనుమతి

Praveen Kumar Lenkala HT Telugu
Sep 29, 2022 11:56 AM IST

Abortion rights: గర్భస్రావం విషయంలో వివాహిత, అవివాహిత అన్న కృత్రిమ వ్యత్యాసానికి తావులేదని, గర్భ స్రావ హక్కును పొందడంలో మహిళలకు స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

<p>అబార్షన్ హక్కుల విషయంలో తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు</p>
అబార్షన్ హక్కుల విషయంలో తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు

abortion rights: ఏకాభిప్రాయంతో గర్భం దాల్చినప్పటికీ అబార్షన్ చేసుకునేందుకు వివాహితులు లేదా అవివాహితులు అనే తేడా లేకుండా మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు అర్హులని సుప్రీంకోర్టు గురువారం ఒక చారిత్రక తీర్పులో పేర్కొంది. 

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం యొక్క వివరణలో వివాహిత, అవివాహిత స్త్రీ మధ్య వ్యత్యాసాన్ని కొనసాగించలేమని, వివాహిత స్త్రీలతో సమానంగా అవివాహిత మహిళ 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

వైవాహిక అత్యాచారం..

భర్తలు చేసే లైంగిక వేధింపులు అత్యాచారం రూపంలోనే ఉంటాయని, అబార్షన్ ప్రయోజనాల కోసం ఎంటీపీ చట్టం నిబంధనల ప్రకారం అత్యాచారం అంటే వైవాహిక అత్యాచారం అనే అర్థాన్ని తప్పనిసరిగా చేర్చాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

అవివాహిత మహిళ ఏకాభిప్రాయంతో 20-24 వారాల వ్యవధిలో అబార్షన్‌కు అనుమతి ఇవ్వవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

ఎంటీపీ చట్టం వివరణ సామాజిక వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సమాజం మారినప్పుడు సామాజిక విధానాలు మారతాయని, అభివృద్ధి చెందుతాయని, చట్టాలు స్థిరంగా ఉండకూడదని తేల్చిచెప్పారు.

‘లైంగిక వేధింపులు లేదా అత్యాచారాల నుండి బయటపడినవారిలో వివాహిత స్త్రీలు కూడా భాగం కావచ్చు. భర్త ఏకాభిప్రాయం లేని చర్య కారణంగా ఒక స్త్రీ గర్భవతి కావచ్చు. సెక్స్, లింగ ఆధారిత హింస కుటుంబాల్లో భాగమైంది’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

‘అంతిమంగా ప్రతి స్త్రీ తన భౌతిక పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవడం ప్రత్యేక హక్కు. వివిధ ఆర్థిక, సాంస్కృతిక లేదా సామాజిక అంశాలు ఈ నిర్ణయంలో పాత్ర పోషిస్తాయి. వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య కృత్రిమ వ్యత్యాసాన్ని కొనసాగించలేం. మహిళలు ఈ హక్కును పొందడానికి స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలి..’ అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. 

‘పునరుత్పత్తి స్వయంప్రతిపత్తి హక్కు శారీరక స్వయంప్రతిపత్తికి సంబంధించినది. పిండం నిలదొక్కుకోవడానికి స్త్రీ శరీరంపై ఆధారపడుతుంది. అందువల్ల గర్భస్రావ నిర్ణయ హక్కు వారి శారీరక స్వయంప్రతిపత్తి హక్కులో భాగంగా ఉంటుంది. ఈ హక్కును ప్రభుత్వం అడ్డుకోవడం.. వారు అనుసరించే దీర్ఘకాల మార్గాన్ని తప్పించడమే అవుతుంది. ఇది వారి గౌరవానికి భంగం కలిగిస్తుంది..’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

ఈ తీర్పు 23 వారాల 5 రోజుల గర్భాన్ని రద్దు చేయాలని కోరుతూ 25 ఏళ్ల మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేసుకు సంబంధించినది. తన భాగస్వామితో తనకున్న సంబంధం ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ, తాను అవివాహితనని, తన భాగస్వామి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారని పేర్కొంది. ఏకాభిప్రాయం కారణంగా ఏర్పడిన గర్భం దాల్చడం మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్, 2003 పరిధిలోకి రాదని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టోస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.

Whats_app_banner