Maharashtra crime news : రోజూ అనుమానిస్తున్నాడని.. భర్తను చంపించిన భార్య!
Maharashtra crime news : రోజూ అనుమానిస్తున్నాడన్న కారణంతో భర్తను చంపించింది ఓ మహిళ. ఆ నేరాన్ని మరో వ్యక్తిపై వేయాలని ప్రయత్నించి, పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనను నిత్యం అనుమానిస్తూనే ఉంటున్నాడన్న కారణంతో.. భర్తను చంపించింది ఓ మహిళ. అనంతరం ఆ నేరాన్ని మరో వ్యక్తిపై మోపింది. చివరికి పోలీసులకు చిక్కింది.
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర లాథుర్లోని జోద్జావాలా గ్రామంలో ఈ నెల 18న జరిగింది ఈ ఘటన. పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఓ మహిళ.. తన భర్తను, అతని బంధువు చంపేశాడని ఫిర్యాదు చేసింది. భూ వివాదం కారణంగా గొడ్డలితో తల నరికేశాడని పేర్కొంది. ఆ వ్యక్తి పేరు చెప్పి, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమండ్ చేసింది. ఘటనపై వెంటనే స్పందించిన గేట్గావ్ పోలీస్ స్టేషన్ అధికారులు.. మహిళ చెప్పిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే పోలీసులకు అసలు విషయం తెలిసింది!
నిందితుడు అని భావించి అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. అతడు చెప్పిన మాటలకు, మరణించిన వ్యక్తి భార్య ఇచ్చిన ఫిర్యాదుకు పొంతనలేకుండా పోయిందని పోలీసులు గ్రహించారు. ఈ క్రమంలోనే ఆ మహిళపై వారికి అనుమానం మొదలైంది. వారు అరెస్ట్ చేసిన వ్యక్తిపై.. అసలేం జరిగి ఉంటుంది? అన్న కోణంలో విచారించడం మొదలుపెట్టారు.
Woman kills huband in Maharasthra : "మరణించిన వ్యక్తి పేరు హన్మంత్ కటారే. నాకు బంధువు. కానీ నేను అతడిని చంపలేదు. కటారేకి అతని భార్యపై అనుమానాలు ఎక్కువ. రోజూ అనుమానిస్తూ ఉండేవాడు. ఆమె.. అతడిని చంపి ఉండొచ్చు. ఆమె తల్లి కూడా ఇందులో సాయం చేసి ఉండొచ్చు," అని సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. ఈ వ్యక్తి చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు అసలు నిజం తెలిసింది. వెంటనే.. 30ఏళ్ల మహిళను, 50ఏళ్ల తల్లిని, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
"అవును. నా భర్తను నేనే చంపేశాను. ఎప్పుడు చూసినా నన్ను అనుమానిస్తూ ఉంటాడు. వేరే పని లేదు. అందుకే చంపేశాను," అని విచారణలో భాగంగా ఒప్పుకుంది నిందితురాలు.
ఇలా చంపేశారు..!
Maharashtra latest news : కటారేను చంపేందుకు.. తల్లితో పాటు మరో ఇద్దరి సాయం తీసుకుంది ఆ మహిళ. ఈ మేరకు పక్కా ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా.. ఈ నెల 18న.. ఇంటికి తిరిగి వస్తుండగా.. గ్రామం శివారులో ఇద్దరు వ్యక్తులు కటారేను అడ్డుకున్నారు. రాడ్లతో కటేరాపై దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత, ఆ మహిళ పోలీసుల వద్దకు వెళ్లి అబద్ధం చెప్పింది.
నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
సంబంధిత కథనం