Crime news : గర్ల్‌ఫ్రెండ్ గొంతు కోసి చంపిన విద్యార్థి.. ఎప్పుడు గొడవలే అని!
Karnataka crime news : తన గర్ల్‌ఫ్రెండ్ గొంతు కోసి చంపేశాడు ఓ వ్యక్తి. కర్ణాటకలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Karnataka crime news : కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎప్పుడు గొడవపడుతోందన్న కారణంతో.. ఓ వ్యక్తి, తన గర్ల్‌ఫ్రెండ్ గొంతుకోసి చంపేశాడు!
ఇదీ జరిగింది..
కర్ణాటక హసన్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నిందితుడు పేరు తేజస్. అతని వయస్సు 23ఏళ్లు. అతనికి 21ఏళ్ల వయస్సు గల గర్ల్‌ఫ్రెండ్ ఉంది. వీరిద్దరు.. హసన్ జిల్లాలోని ఓ కాలేజ్‌లో ఇంజినీరింగ్ చదువుకుంటున్నారు.
కాగా.. వీరి రిలేషన్లో ఎప్పుడు గొడవలే ఉండేవి. ఈ నేపథ్యంలో.. ఇటీవలే వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేద్దామని ఫిక్స్ అయ్యాడు తేజస్. 'పర్సనల్‌గా మాట్లాడాలి. కలుద్దాము,' అని చెప్పి, పిలిపించి.. మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే.. కతితో ఆమెపై దాడి చేశాడు. గొంతు కోసేశాడు. ఆ మహిళ.. విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది.
Man kills girlfriend : రక్తపుమడుగులో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
అదే సమయంలో.. మహిళ ఎవరు? అక్కడికి ఎలా వచ్చింది? ఆమెను ఎవరు చంపారు? అన్న ప్రశ్నలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే.. తేజస్ వ్యవహారం తెలుసుకుని.. అతడిని అరెస్ట్ చేశారు. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
బాలిక గ్యాంగ్ రేప్..
Minor gang raped in Uttar Pradesh : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలు, బాలికపై హత్యలు, అత్యాచారాలు ఆందోళనకరంగా మారాయి. ఓ 12ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైన ఘటన.. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో కలకలం సృష్టించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు సమీపంలో జరిగింది ఈ ఘటన.
"ఓ మైనర్ని నలుగురు కిడ్నాప్ చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. బాధితురాలిని, ఆమె ఇంటికి సమీపంలో వదిలేసి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను.. ఆమె కుటుంబసభ్యలు గుర్తించి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై మాకు సమాచారం అందిన వెంటనే దర్యాప్తు చేపట్టాము," అని పోలీసులు వివరించరు.
Uttar Pradesh crime news : "బాలిక స్టేట్మెంట్ తీసుకున్నాము. నలుగురిలో ఇద్దరిని అరెస్ట్ చేశాము. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టాము," అని పోలీసులు స్పష్టం చేశారు.
మిగిలిన వారిని కూడా వెంటనే పట్టుకుని, బాలికకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు పోలీసులు.
సంబంధిత కథనం