Crime News | ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం
Crime News | చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని దాదాపు ఏడాదిన్నరగా ఇంట్లోనే పెట్టుకున్న కుటుంబం కథ ఇది. చివరకు అధికారులు జోక్యం చేసుకోవడంతో శవాన్ని ఖననం చేశారు.
Crime News | యూపీలోని కాన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత సంవత్సరం ఏప్రిల్ లో కాన్పూర్ లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయం లో పనిచేసే విమలేశ్ అనారోగ్యంతో చనిపోయారు.
Crime News | బతికే ఉన్నాడు.
అయితే, ఆసుపత్రి నుంచి ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన తరువాత కుటుంబ సభ్యులకు ఆయన బతికే ఉన్నాడని అనుమానం కలిగింది. దాంతో ఆయన కోమాలో ఉన్నాడని, ఎప్పటికైనా మళ్లీ లేస్తాడని విశ్వసించారు. దాదాపు ఏడాదిన్నరగా వారు ఇదే విశ్వాసంతో ఉన్నారు. బంధు మిత్రులకు కూడా ఇదే విషయం చెప్పారు.
Crime News | సీఎం ఆఫీస్ కు లేఖ
ఈ ఉదంతంపై యూపీ సీఎం ఆఫీస్ కు ఇటీవల ఒక లేఖ వచ్చింది. దాంతో స్థానిక పోలీసు అధికారులతో కలిసి, ఆరోగ్య శాఖ అధికారులు వారి ఇంటికి వెళ్లారు. వారు ఎంత సర్ది చెప్పినా కుటుంబ సభ్యులు వినలేదు. దాంతో ఆసుపత్రిలో పరీక్ష జరిపిద్దామని చెప్పి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో పరీక్ష చేయించి, ఆ వ్యక్తి చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ముందే నిర్ధారించారు. దాంతో ఆ మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని పూర్తిగా వస్త్రాలతో కప్పారని, మృతదేహానికి కొన్ని రసాయనాలు కూడా పూసినట్లుగా కూడా తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు.