5 states elections: రాష్ట్రాల ఎన్నికల బరిలో నలుగురు కేంద్ర మంత్రులు, 18 మంది ఎంపీలు; తగ్గేదే లేదంటున్న బీజేపీ-18 mps including 4 ministers in 3 states bjp heavyweights in assembly polls ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5 States Elections: రాష్ట్రాల ఎన్నికల బరిలో నలుగురు కేంద్ర మంత్రులు, 18 మంది ఎంపీలు; తగ్గేదే లేదంటున్న బీజేపీ

5 states elections: రాష్ట్రాల ఎన్నికల బరిలో నలుగురు కేంద్ర మంత్రులు, 18 మంది ఎంపీలు; తగ్గేదే లేదంటున్న బీజేపీ

HT Telugu Desk HT Telugu
Oct 10, 2023 09:20 PM IST

5 states elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల ముందు జరిగే సెమీ ఫైనల్స్ గా అంతా భావిస్తున్నారు. దాంతో, ఈ ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాలు గెల్చుకోవాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

5 states elections: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో షాక్ లో ఉన్న బీజేపీకి ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ గా మారాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాల్లో విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది.

Madhya Pradesh: జాబితాలతో సిద్ధం

నామినేషన్లకు సమయం సమీపిస్తుండడంతో వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసే పని లో పడ్డాయి. ఈ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా వెళ్తున్న బీజేపీ.. వివిధ రాష్ట్రాల్లో దాదాపు నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను అభ్యర్థులుగా నిలపాలని నిశ్చయించింది. వారిలో మధ్య ప్రదేశ్ లో ఏడుగురు ఎంపీలను, రాజస్తాన్ లో ఏడుగురు ఎంపీలను పోటీలో నిలుపుతోంది. చత్తీస్ గఢ్ బరిలో నలుగురు ఎంపీలకు టికెట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ లో తమ అభ్యర్థుల రెండో జాబితాను సెప్టెంబర్ చివర్లోనే బీజేపీ ప్రకటించింది. ఆ జాబితాలో ముగ్గురు కేంద్ర మంత్రులకు స్థానం కల్పించింది. వారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఉన్నారు.

Rajasthan: రాజస్తాన్ కీలకం

రాజస్తాన్ లో ఈ సారి గెలిచి తీరాలనే కృత నిశ్చయంతో బీజేపీ ఉంది. అందువల్ల ప్రకటించిన తొలి జాబితాలోనే ఏడుగురు ఎంపీలకు స్థానం కల్పిస్తూ, అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. వారిలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ తో కలిసి పనిచేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే, స్థానిక ఓటర్లకు, బీజేపీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వస్తుందని, అందువల్లనే ఎంపీలను, కేంద్ర మంత్రులను బరిలో నిలుపుతున్నామని రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వ్యాఖ్యానించారు.

Chhattisgarh: చత్తీస్ గఢ్ పై ఆశలు..

చత్తీస్ గఢ్ ఎన్నికలకు సంబంధించి 64 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితాను వెలువరించింది. తొలి జాబితాలో 21 మంది కొత్త ముఖాలకు స్థానం కల్పించిన బీజేపీ.. రెండో జాబితాలో గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చింది. ఎంపీ విజయ్ బాఘెల్ కు తొలి జాబితాలోనే సీటు కేటాయించింది. ఇప్పుడు రెండో జాబితాలో కేంద్ర మంత్రి రేణుక సింగ్ సహా మరో ముగ్గురు ఎంపీలకు టికెట్లు కేటాయించింది.

Whats_app_banner