Telugu News  /  Lifestyle  /  Thursday Motivation On Have To Get Up Every Morning And Tell Yourself I Can Do This
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : మీరు ఏ పనిని సరిగ్గా చేయలేకపోతున్నారా? అయితే ఇది మీకోసమే..

19 January 2023, 4:00 ISTGeddam Vijaya Madhuri
19 January 2023, 4:00 IST

Thursday Motivation : జీవితంలో అతి పెద్ద సమస్య ఎక్కడ ప్రారంభం అవుతుందో తెలుసా? దానికి బదులు ఎక్కడో లేదు. మనలోనే ఉంది. అవును ప్రతి సమస్య మన ఆలోచనలతోనే మొదలవుతుంది. దీనిని మనం చేయలేము.. లేదా ఇది మనకి వద్దు.. ఇది కావాలి.. అనే కోరికలతో సతమతమవుతూ.. ఉంటాము. అలాకాకుండా మనకి ఏది కావాలి అనే క్లారిటీతో ఉండి చూడండి.. మీకే మ్యాటర్ అర్థమవుతుంది.

Thursday Motivation : అవును ప్రతి ఉదయాన్నే లేచిన వెంటనే మీరు ఏమి చేయాలనుకుంటున్నారో.. మీరు ఏమి చేయాలో.. ఒకసారి అనుకోండి. ఈ టైమ్​కి ఇది చేయాలి.. ఈ టైమ్​కి అక్కడికి వెళ్లాలి లాంటివి.. ఎక్కడా రాసుకోకపోయినా పర్లేదు. కానీ.. ఒక్కసారి మైండ్​లో అనుకుంటే.. ఆ పనులు తెలియకుండానే వాటంతటా అవే జరిగిపోతూ ఉంటాయి. మనకి క్లారిటీ లేనప్పుడు పనుల్లో ఆలస్యం ఎక్కువగా జరుగుతుంది. ఆలస్యం ఎక్కువయ్యే కొద్ది బద్ధకం పెరిగిపోతుంది. అప్పుడు ఏమి చేసినా.. మన కంట్రోల్​లో ఉండదు.

ట్రెండింగ్ వార్తలు

మనం ఏమి చేసినా.. చేయకపోయినా.. మనపై మనం నమ్మకముంచాలి. మనం దేనినైనా చేయగలం అని చెప్పుకోండి. భయపడకండి. చాలా మంది కొత్త విషయాలు ప్రయత్నించాలంటే భయపడుతూ ఉంటారు. అమ్మో ఎలా అది.. ఇది అని. ముందే మీరు భయపడిపోతే సింపుల్​ పనులు కూడా చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు చేయగలను అని మీపై నమ్మకముంచండి. కనీసం మీ ప్రయత్నం కూడా మీకు మంచి అనుభవాన్ని ఇస్తుంది. ముందే భయపడిపోతే.. దానిని ప్రయత్నించడానికి కూడా వెనకాడాల్సి వస్తాది. తర్వాత అరె కనీసం ట్రై చేయాల్సిందే అని బాధపడుతూ ఉంటాము. మనం ప్రయత్నించకముందే ఓటమిని అంగీకరించకండి.

జీవితంలో రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటే.. అంత మంచి ఫలితాలు దక్కుతాయి. కోరికలు ఎక్కువయ్యే కొద్ది.. ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఆలోచనలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల మీ పని కొండ ఎక్కుతుంది. అది రోజు రోజుకు మోయలేని బరువుగా తయారు అవుతుంది. మీ పని మీకు భారంగా మారుతుంది. మనం ఏమి చేస్తున్నాము.. మనకి ఏమి కావాలి.. దానికోసం మనం ఏమి చేయాలి అనే అవగాహన ఉండాలి. ఉదయాన్నే దీనిపై ఓ క్లారిటీ తెచ్చుకుంటే.. ఆరోజు మీకు కచ్చితంగా సానుకూలంగా ఉంటుంది.

సెల్ఫ్ మోటీవేషన్ అనేది మీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అందుకే ప్రతి ఉదయం లేచిన వెంటనే ఏ పని చేయాలనుకున్నా.. దానిని మీరు చేయగలరని నమ్మండి. అప్పుడే మీ పని సులభంగా, వేగంగా జరుగుతుంది. పైగా ఉదయాన్నే ఇలాంటి ఆలోచనలు మీలో పాజిటివిటీని పెంచుతాయి. దాని వల్ల కలిగే అనేక సమస్యలను ఎదుర్కోగలిగే సామర్థ్యంలో మీలో ఉంటుంది. ఆత్మన్యూనతా భావాలు తొలగిపోతాయి. మీ ఆలోచన విధానం మారిపోతుంది. అంతేకాదు మీలో తెలియని ఉల్లాసం, చురుకుదనం వస్తుంది. చేసే ప్రతి పనిలో ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కానీ రియాలిటీని మాత్రం మరచిపోవద్దు. మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోండి. ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా మంచే తీసుకోండి. చేసే పనిని ఎప్పుడూ చులకనగా చూడకండి.