Rose Day Wishes: ఇలా వాట్సాప్లో మెసేజ్ పంపండి.. అలా పడిపోతారు
Rose Day wishes: వాలెంటైన్ వీక్ వచ్చింది. ఫిబ్రవరి 7న రోజ్ డేతో మెుదలైంది. మరి ప్రియమైన వారికి వాట్సాప్ సందేశాలు, విషెస్ పంపాలి కదా. వారికి పంపడానికి ఇక్కడ కొన్ని WhatsApp సందేశాలు ఉన్నాయి.
Rose Day greetings: వాలెంటైన్స్ వీక్ మెుదలైంది. తమ ప్రియమైన వారిని ఆనందంగా ఉంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. రోజ్ డే(Rose Day), చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, చివరగా వాలెంటైన్స్ డే వరకూ ఎలా సర్ ప్రైజ్ చేయాలా అని చూస్తారు. ఫిబ్రవరి 7న రోజ్ డే మెుదలైంది. ఒక గులాబీ ఇచ్చి.. మీ ఇష్టాన్ని తెలుపుతారు. కానీ ఎన్ని ఇచ్చినా.. ఏది చేసినా.. మీరు చెప్పే ఒక్కమాట చాలు.. గుండెల్లో ఉండిపోడానికి.. సో.. మనసుకు తాకేలా.. విషయాన్ని చెప్పాలి.
ట్రెండింగ్ వార్తలు
ఫిబ్రవరి 7న ప్రేమికులు ఒకరికొకరు గులాబీలను ఇస్తారు. గులాబీల రంగు అవతలి వ్యక్తి పట్ల మన భావాన్ని వ్యక్తం చేస్తుందని నమ్ముతారు. ఉదాహరణకు, ఎరుపు గులాబీ అంటే ప్రేమ. నారింజ రంగు ఇస్తే ఇంట్రస్ట్, పసుపు రంగు గులాబీ అయితే జీవితకాల స్నేహం గురించి చెబుతుంది. సరే.. ప్రియమైన వారు మీ ముందు ఉండాలని లేదు కదా. వివిధ నగరాల్లో ఉండి నేరుగా గులాబీలను ఇవ్వలేని వారు., తమ భావాలను వ్యక్తీకరించడానికి, ఇష్టమైన వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి కొన్ని సందేశాలు పంపండి.
Rose Day Quotes: రోజ్ డే కోట్స్ గ్రీటింగ్స్
రాత్రి చివరి ఆలోచన.. ఉదయం లేవగానే మెుదటి ఆలోచన నువ్వే.. హ్యాపీ రోజ్ డే..
నీపై నా ప్రేమ ఉదయం ఉదయించి.. సాయంత్రం అస్తమించేది కాదు.. కళ్లలో ఉదయించి.. కనుమూసేంత వరకూ అస్తమించనిది.. హ్యాపీ రోజ్ డే
జీవితం ముళ్ళతో నిండి ఉంది. కానీ నువ్ నా పక్కన ఉంటే.. అది గులాబీల తోట మాత్రమే. ఏ ముళ్లు నన్నేం చేయలేదు.
నా హృదయం నీదే అని ఈ ప్రపంచానికి ప్రకటిస్తున్నాను. కలిసి ఈ జీవితాన్ని గడుపుదాం. హ్యాపీ రోజ్ డే!
నువ్ తెల్ల గులాబీ అయితే.. నేను ఎర్ర గులాబీ.. నిన్ను నాలా ఎర్ర గులాబీగా మార్చేస్తా.. నాతో జీవితాంతం తోడు ఉంటావా.
ప్రపంచంలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోయేవి. మన ప్రేమ కథ కూడా ప్రత్యేకమనదే.. హ్యాపీ రోజ్ డే.
నేను పంపే గులాబీలు ఎండిపోవచ్చు.. కానీ నీపై నా ప్రేమ అమరం. ఈ అందమైన రోజు మనది. హ్యాపీ రోజ్ డే.
నువ్ నా లోపాలను, కష్టాలను చూశావ్. అయినప్పటికీ నన్ను నన్నుగా అంగీకరించావ్. నేను నిన్ను ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. హ్యాపీ రోజ్ డే.
నువ్ ఉంటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా పెదాలపైకి చిరునవ్వు వస్తుంది. నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన నీకు రోజ్ డే శుభాకాంక్షలు.
నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో ఎవరూ లేరు. కానీ నువ్ ఒంటరిగా ఉంటే నేను తట్టుకోలేను. నీకు తోడుగా నేనుంటా.. హ్యాపీ రోజ్ డే
సంబంధిత కథనం