Mint Paratha: పుదీనాతో పరాటాలు.. హెల్తీ, టేస్టీ అల్పాహారం..-know how to cook mint parathas for breakfast in tasty way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mint Paratha: పుదీనాతో పరాటాలు.. హెల్తీ, టేస్టీ అల్పాహారం..

Mint Paratha: పుదీనాతో పరాటాలు.. హెల్తీ, టేస్టీ అల్పాహారం..

Koutik Pranaya Sree HT Telugu
Dec 25, 2023 06:30 AM IST

Mint Paratha: పుదీనాతో చేసే పరాటాలు చాలా రుచిగా, మంచి ఫ్లేవర్‌తో ఉంటాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెల్సుకోండి.

పుదీనా పరాటా
పుదీనా పరాటా (https://creativecommons.org/licenses/by-sa/4.0)

అల్పాహారంలోకి, లంచ్ లోకి రకరకాల పరాటాలు ప్రయత్నిస్తాం. ఒకసారి ఈ పుదీనా పరాటాలు కూడా చేసుకుని చూడండి. చాలా సింపుల్‌గా, తక్కువ పదార్థాలతో రెడీ అయిపోతాయి. తయారీ కూడా సులభమే. వీటిని ఎలా చేయాలో వివరంగా చూసేయండి.

పుదీనా పరాటా కోసం కావాల్సిన పదార్థాలు:

1 కప్పు పుదీనా ఆకులు

2 కప్పుల గోదుమపిండి

3 చెంచాల నెయ్యి లేదా వెన్న

తగినంత ఉప్పు

సగం చెంచా వాము

సగం చెంచా సోంపు గింజలు

2 ఎండుమిర్చి

1 చెంచా చాట్ మసాలా

పుదీనా పరాటా తయారీ విధానం:

  1. ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి.
  2. ఈ ఆకుల్లో సగం పిండి కలుపుకోవడంలో, మిగతా సగం మసాలా తయారీకి వాడుకోవాలి.
  3. పిండి తడుపుకోవడం కోసం ఒక పెద్ద బౌల్‌లో గోదుమపిండి, కొద్దిగా నూనె లేదా నెయ్యి, ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకుని పుదీనా ఆకుల్ని కూడా వీలైనంత సన్నగా తరుగుకుని వేసుకోవాలి.
  4. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని పావుగంట పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఒక ప్యాన్ లో పుదీనా ఆకులు తీసుకుని నూనె లేకుండా వేయించాలి. కాస్త పొడిగా అయ్యాక బయటకు తీసుకోవాలి. అదే కడాయిలో సోంపు, వాము వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించాలి.
  6. వీటన్నింటినీ పొడిగా మిక్సీ పట్టుకుని పొడిలాగా చేసుకోవాలి. ఇదే పొడిలో చాట్ మసాలా కూడా కలుపుకోవాలి.
  7. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండితో చపాతీల్లాగా ఒత్తుకోవాలి. తర్వాత మీద కొద్దిగా నెయ్యి రాసుకుని మసాలా పొడి చల్లుకోవాలి. మసాలా చల్లుకున్నాక చపాతీని దగ్గరికి అనుకుంటూ ఉండలా చేసుకోవాలి.
  8. మళ్లీ సన్నగా చపాతీల్లాగా ఒత్తుకొని పెనం మీద నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే.. పుదీనా పరాటా రెడీ.

WhatsApp channel