Makeup tips: మేకప్ వేసుకున్నాక తెల్లగా, పగిలినట్లు అవుతోందా? ఈ చిట్కాలు పాటించండి..-foundation mistakes to avoid to get flawless makeup finish ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Foundation Mistakes To Avoid To Get Flawless Makeup Finish

Makeup tips: మేకప్ వేసుకున్నాక తెల్లగా, పగిలినట్లు అవుతోందా? ఈ చిట్కాలు పాటించండి..

Koutik Pranaya Sree HT Telugu
May 25, 2023 03:44 PM IST

Makeup tips: మేకప్ వేసుకునేటపుడు కొన్ని తప్పులు చేస్తే తెల్లగా, పగిలినట్లు అవుతుంది. అలా కాకుండా నేచురల్ గా మేకప్ కనిపించాలంటే ఈ చిట్కాలు పాటించండి.

మేకప్ చిట్కాలు
మేకప్ చిట్కాలు (pexels)

మేకప్ వేసుకునేటపుడు ఫౌండేషన్ చాలా ముఖ్యం. కానీ దాన్ని సరిగ్గా వేసుకోకపోతే మేకప్ ఎబ్బెట్టుగా, తెల్లగా పగిలినట్లు కనిపిస్తుంది. చాలా మందికి ఈ సమస్యే ఉంటుంది. మనం ఎంచుకునే ఉత్పత్తి నుంచి, దాన్ని ముఖానికి రాసుకోవడం వరకు కొన్ని తప్పులు చేయకూడదు.

ఎందుకలా అవుతుంది?

ఎక్కవ ఫౌండేషన్ రాసుకున్నా, లేదా పొడి చర్మం మీద రాసినా, సరిగ్గా బ్లెండ్ చేయకపోయినా ఫౌండేషన్ తేలినట్లు కనిపిస్తుంది.

ఫౌండేషన్ బాగుండాలంటే కొన్ని చిట్కాలు:

 

  1. సెట్టింగ్ స్ప్రే: బేస్, కాంటౌరింగ్, బ్రాంజింగ్ , హైలైటింగ్ తో మేకప్ పూర్తవుతుంది. మీరు వేసుకున్న మేకప్ వేడికి, చెమటకు పాడవకుండా, చెక్కుచెదరకుండా ఉండాలంటే చివర్లో సెట్టింగ్ స్ప్రే తప్పనిసరి. ఇది మేకప్ అలాగే ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేస్తుంది.
  2. బ్లెండింగ్: ఫౌండేషన్ పెట్టుకోగాని తెలతెల్లగా కనిపిస్తుందంటే మీరు సరిగ్గా రాసుకోలేదని అర్థం. లేదా మీ చర్మ రంగుకు తగ్గ ఫౌండేషన్ ఎంచుకోకపోవడం కూడా కారణమే. ఒక సారి ఫౌండేషన్ వేసుకున్నాక అది ఆరాకే ఇంకో కోటింగ్ వేయాలి. స్పాంజితో బాగా బ్లెండ్ చేయాలి.
  3. కంటికింద మేకప్: ఫౌండేషన్ ఎక్కువగా కొట్టినట్లు కనిపించేది కళ్ల కిందే. ఫౌండేషన్ పెట్టుకోడానికి ముందే సీరమ్ లేదా టోనర్ కంటి కింద రాసుకుంటే ఈ సమస్య రాదు. అక్కడ చర్మం పొడిబారదు.
  4. ఫౌండేషన్ ఎక్కువయితే.. : ఫౌండేషన్ ఎక్కువయ్యింది అనిపిస్తే ఏం పరవాలేదు. వెంటనే తడిగా ఉన్న మేకప్ స్పాంజి తీసుకుని మీకు ఫౌండేషన్ ఎక్కువుంది అనిపించిన చోట పైపైన అద్దండి. లేదా పేపర్ టవెల్ కూడా వాడొచ్చు.
  5. ఫేస్ ఆయిల్: మేకప్ తేలినట్టు కనిపించడానకి ముఖ్య కారణం పొడి చర్మం. అందుకే మేకప్ కన్నా ముందు తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మం ఎక్కువ పొడిబారితే ఫేస్ ఆయిల్ కూడా వాడొచ్చు. దీనివల్ల ఫౌండేషన్ చక్కగా కలిసిపోతుంది.
  6. సెట్టింగ్ పౌడర్: మీది జిడ్డు చర్మం అయినా కూడా ఫౌండేషన్ చెమట వల్ల, జిడ్డు వల్ల పాడైపోతుంది. అలాంటపుడు పొడి చర్మం ఉన్న వాళ్లు ఫేస్ ఆయిల్, జిడ్డు చర్మం ఉన్నవాళ్లు సెట్టింగ్ పౌడర్ వాడాలి. అంటే మేకప్ పూర్తయ్యాక ఒకసారి సెట్టింగ్ పౌడర్ తో అద్దితే చెమటతో ముఖం మెరిసినట్టు అవ్వదు.
  7. ప్రైమర్: మంచి ప్రైమర్ వాడితే అది మేకప్ చెక్కుచెదరకుండా చూసుకుంటుంది. సిలికాన్ ఆధారిత ఫౌండేషన్ వాడితే సిలికాన్ ఆధారిత ప్రైమర్ వాడటం, లేదా రెండూ వాటర్ బేస్ట్ వి వాడటం మంచిది.

ఫౌండేషన్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే నేచురల్ మేకప్ లుక్ మీ సొంతమవుతుంది.

WhatsApp channel