Face Serums : సహజమైన ఫేస్ సీరమ్‌లను.. ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి..
Face Serums : మీరు సంపూర్ణ చర్మ సంరక్షణను కోరుకుంటుంటే.. మీరు కచ్చితంగా ఫేస్ సీరమ్ వాడాల్సిందే. ఇవి మీకు మెరిసే, ఆరోగ్యమైన చర్మాన్ని ఇస్తుంది. పోషణతో కూడిన మెరుపును, తేమను కావాలనుకునేవారు ఫేస్ సీరమ్ వాడాల్సిందే అంటున్నారు నిపుణులు.
Face Serums : మీ ముఖ సౌందర్యం కాపాడుకోవడంలో ఫేస్ సీరమ్‌లు కచ్చితంగా మేజర్ పాత్ర పోషిస్తాయి. ఫేస్ సీరమ్లనే హైడ్రేటింగ్ నూనెలు అంటారు. వీటిలో యాంటీ ఏజింగ్, యాంటీ-యాక్నే లక్షణాలు కూడా ఉంటాయి. అవి మీ చర్మ ఆకృతిని మెరుగుపరుస్తాయి. అయితే సహజమైన ఫేషియల్ సీరమ్‌లు వాడాలనుకునేవారికి ఇక్కడ కొన్ని హోమ్ మేడ్ ఫేస్ సీరమ్‌లు ఉన్నాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో.. వేటితో ఏమి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
విటమిన్ సి సీరం
జిడ్డుగల చర్మం కోసం ఉపయోగించడానికి ఉత్తమమైన పదార్ధాలలో ఒకటి విటమిన్ సి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. స్కిన్ టోన్, ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఇది మొటిమలు, ముడతలు, డల్ స్కిన్‌ని కూడా తొలగిస్తుంది.
విటమిన్ సి పౌడర్‌ను రోజ్ వాటర్‌తో కలపాలి. దానిలో కొంచెం అలోవెరా జెల్, బాదం నూనె వేసి.. బాగా కలపాలి. అంతే మీ విటమిన్ సి సీరం.. ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లే.
దోసకాయ, కలబంద సీరం
దోసకాయ, కలబంద సీరం మీ చర్మానికి త్వరిత పోషణను అందిస్తుంది. యవ్వనంగా, ప్రకాశంగా మెరిసేలా చేస్తుంది. ఇది మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి.. మచ్చలు, నల్ల మచ్చలు, గీతలు, ముడతలను కూడా తగ్గిస్తుంది.
తాజాగా తరిగిన దోసకాయలో అలోవెరా జెల్‌ని కలపండి. ఈ ద్రవాన్ని కొన్ని చుక్కలను తీసుకుని మీ ముఖంపై పూయండి. ఉదయాన్నే కాంతివంతంగా, మెరిసే చర్మం కావాలనుకునేవారు రాత్రంతా దానిని అలానే వదిలివేయండి. ఉదయం చల్లని నీటితో ముఖం కడగండి.
టీ ట్రీ సీరం
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో ప్యాక్ చేసిన ఈ టీ ట్రీ సీరం జిడ్డును దూరంగా ఉంచుతుంది. ముఖంపై ఉన్న రంధ్రాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మచ్చలను తగ్గిస్తుంది. మంటను తగ్గిస్తుంది. మీకు మృదువైన, స్పష్టమైన చర్మాన్ని ఇస్తుంది.
రోజ్ వాటర్, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి.. అలోవెరా జెల్, రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేయాలి.
పాలు, టమోటా సీరం
విటమిన్ ఎతో నిండిన పచ్చి పాలు నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్, మచ్చలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. టొమాటో సూర్యరశ్మి వల్ల కలిగే ట్యాన్, మొటిమలకు చికిత్స చేస్తుంది.
టొమాటో రసం, పచ్చి పాలు కలిపి ముఖానికి పట్టించాలి. మీరు దానిని రాత్రంతా వదిలివేయవచ్చు. లేదా 15-20 నిమిషాల తర్వాత కడగాలి. ఉత్తమ ఫలితాల కోసం నిద్రవేళకు ముందు దీన్ని ఉపయోగించండి.
సంబంధిత కథనం
టాపిక్