Eye flu: ఈ లక్షణాలుంటే కండ్ల కలక కావచ్చు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..-eye flu cases rising in schools measures to children from conjunctivitis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eye Flu: ఈ లక్షణాలుంటే కండ్ల కలక కావచ్చు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

Eye flu: ఈ లక్షణాలుంటే కండ్ల కలక కావచ్చు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

Parmita Uniyal HT Telugu
Jul 31, 2023 08:30 AM IST

Eye flu: వాతావరణంలో మార్పుల వల్ల కండ్ల కలక కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

కళ్ల కలక లక్షణాలు, జాగ్రత్తలు
కళ్ల కలక లక్షణాలు, జాగ్రత్తలు (Freepik)

కండ్ల కలక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా స్కూళ్లలో పిల్లల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని ఆరోగ్య జాగ్రత్తల గురించి సలహాలు తెలుసుకోవడం ఉత్తమం. ఈ ఇన్ఫెక్షన్ వల్ల డిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ కేసులు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. అందుకే అంతటా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ చేతులు కడగడం, కళ్లు ముట్టుకోకపోవడం, చేతి రుమాళ్లను ఒకరితో పంచుకోకపోవడం, సామాజిక దూరం పాటించడం లాంటివి తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

లక్షణాలు ఎలా ఉంటాయి?

కళ్ల కలక కేసులు ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్, ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు వల్ల రావచ్చు. కళ్లు ఎరుపెక్కడం, దురద, కను రెప్పలు ఉబ్బినట్టు అనిపించడం దీని లక్షణాలు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే గనక కళ్ల నుంచి నలక ఎక్కువగా రావొచ్చు. అయితే కంట్లో డ్రాప్స్ వేసుకోవడం వల్ల వీటినుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అయితే లక్షణాలన్నీ తగ్గడానికి వారం నుంచి రెండు వారాల సమయం పట్టొచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. చేతులు శుభ్రం చేసుకోవడం:

పిల్లలు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కునేలా అలవాటు చేసుకోవాలి. దానివల్ల క్రిములు చేరవు. లేదంటే చేతులు కంట్లో పెట్టుకున్నపుడు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

2. కళ్లను ముట్టుకోవడం:

పిల్లలు కళ్లు తరచూ ముట్టుకోకుండా, నలవకుండా చూసుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుందని పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేయండి.

3. టిష్యూలు వాడటం:

తుమ్మినపుడు, దగ్గినపుడు వైరస్ బారిన పడకుండా టిష్యూ అడ్డుపెట్టుకోవడం అలవాటు చేయాలి. దానివల్ల గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు ఒకరినుంచి ఒకరికి సోకకుండా ఉంటాయి.

4. వ్యక్తిగత శుభ్రత:

కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సులు వంటివాటిని ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

5. దూరం పాటించడం:

తోటి పిల్లలకు ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కాస్త దూరంగా ఉండాలని పిల్లలకు సూచించాలి.

6. వైద్య సలహా:

ఐ ఫ్లూ లక్షణాలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. దానివల్ల ఇన్ఫెక్షన్ మరింత పెరగకుండా ఉంటుంది.

WhatsApp channel