Electronic Fire Crackers : వాయు కాలుష్యం లేకుండా దీపావళికి.. పటాకులు కాల్చేయండి-electronic fire crackers with bumper offer in amazon great indian festival ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Electronic Fire Crackers : వాయు కాలుష్యం లేకుండా దీపావళికి.. పటాకులు కాల్చేయండి

Electronic Fire Crackers : వాయు కాలుష్యం లేకుండా దీపావళికి.. పటాకులు కాల్చేయండి

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 12, 2022 10:37 AM IST

Electronic Fire Crackers For this Diwali : ప్రభుత్వాలు, కోర్టులు, ప్రకృతి ప్రేమికులు, పలువురు కార్యకర్తలు దీపావళి సమయంలో వాయు కాలుష్యం అవుతుందని నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే దీపావళికి వాయు కాలుష్యం లేకుండా.. పటాకులు కాల్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఎలక్ట్రానిక్ పటాకులను ఎంచుకోవచ్చు.

ఎలక్ట్రికల్ పటాకులు
ఎలక్ట్రికల్ పటాకులు

Electronic Fire Crackers For this Diwali : దీపావళి దగ్గరలోనే ఉంది. దీనిని వెలుగులు పంచే పండుగగా భావిస్తారు. అయినప్పటికీ దీపావళి గురించి ప్రస్తావన వస్తే.. మనలో చాలామంది.. పటాకుల గురించే ఎక్కువ ఆలోచిస్తారు. కానీ కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి సమయంలో.. భయంకరమైన వాయు కాలుష్యం కారణంగా దేశవ్యాప్తంగా అనేక నగరాలు పటాకులను నిషేధించాయి. ప్రభుత్వాలు, కోర్టులు, కార్యకర్తలు బాణాసంచాపై నిరసనలు కొనసాగిస్తున్నారు.

అయితే దీపావళి ఔత్సాహికులు వాయుకాలుష్యం లేకుండా.. పటాకులతో దీవాళిని జరుపుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. అవే ఎలక్ట్రానిక్ పటాకులు. కొన్ని సంవత్సరాలుగా దీపావళి అమ్మకాలలో ఎలక్ట్రానిక్ బాణసంచాకు గొప్ప స్పందన లభించింది. కొందరు మాత్రం ధర ఎక్కువని సంకోచిస్తున్నారు. అయితే తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మాత్రం ఎలక్ట్రానిక్ పటాకులు రూ. 2,000 తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పటాకులు కాంతిని ఉత్పత్తి చేస్తాయి. నిజమైన పటాకుల ధ్వనిని ఇస్తాయి. నిజమైన బాణసంచాతో పోల్చినప్పుడు.. ధ్వని, కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. వాయు కాలుష్యం జరగకుండా పండుగ చేసుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో.. ఎల్‌ఈడీ లైట్, రిమోట్‌తో కూడిన A2Z మెటల్ ఎలక్ట్రానిక్ లౌడ్ ఫైర్‌క్రాకర్స్ రూ. 2,000 తగ్గింపు తర్వాత రూ.2,999కి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్‌ను కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇవి అతి తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది కాబట్టి.. మీ పటాకుల సరదా కూడా తీరిపోతుంది. ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

స్మార్ట్ ఎలక్ట్రానిక్ పటాకులు అనేక పటాకుల శబ్దాన్ని ప్రతిబింబించగలవు. పరికరం యాదృచ్ఛిక వ్యవధిలో స్పార్క్ చేసే పాడ్‌ల జాబితాను కలిగి ఉంది. అనేక పాడ్‌లు పటాకుల మాదిరిగానే పగులగొట్టే శబ్దాన్ని చేస్తాయి. ఒరిజినల్ ఫైర్‌క్రాకర్ మాదిరిగానే ధ్వని అనుభూతిని సృష్టిస్తుంది. అంతే కాకుండా పాడ్‌ల చివర జోడించిన LED లైట్లు కూడా వెలిగునిస్తాయి. ఎలక్ట్రానిక్ పటాకుల కాంతి, ధ్వని, వేగాన్ని రిమోట్ కంట్రోలర్ ద్వారా సర్దుబాటు చేయవచ్చు.

పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఎలక్ట్రానిక్ పటాకులు ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో త్వరగా అమ్ముడవుతాయి. అయితే ఈ పరికరాలను దీపావళి సీజన్‌లో స్థానిక మార్కెట్‌లలో కూడా చూడవచ్చు. మీరు ఈ దీపావళికి ఎలక్ట్రానిక్ బాణసంచా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. వార్షిక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో కొనేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం