Cultural Fests in 2023 : ఇండియాలో టాప్ 5 సాంస్కృతిక ఉత్సవాలు ఇవే.. 2023లో ఎప్పుడు జరుగుతాయంటే..-cultural fests in india you must attend in 2023 here is the dates and details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cultural Fests In 2023 : ఇండియాలో టాప్ 5 సాంస్కృతిక ఉత్సవాలు ఇవే.. 2023లో ఎప్పుడు జరుగుతాయంటే..

Cultural Fests in 2023 : ఇండియాలో టాప్ 5 సాంస్కృతిక ఉత్సవాలు ఇవే.. 2023లో ఎప్పుడు జరుగుతాయంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 20, 2023 10:00 AM IST

Cultural Fests in India : మీకు సాంస్కృతిక ఉత్సవాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇండియాలో జరిగే పలు ఉత్సవాలకు హాజరు కావొచ్చు. 2023లో భారతదేశంలో జరిగే టాప్ 5 సాంస్కృతిక ఉత్సవాలు ఎక్కడ.. ఎప్పుడూ జరుగుతాయో తెలుసుకుని.. మీరు ఓ ట్రిప్ వేసేయండి.

సాంస్కృతిక ఉత్సవాలు 2023
సాంస్కృతిక ఉత్సవాలు 2023

Cultural Fests in India : భారతదేశం పలు సంస్కృతులు, వారసత్వం, ఆచారాలు, సంప్రదాయాల సమ్మేళనం. అందుకే ఇది ప్రతి ఒక్కరినీ ముక్తకంఠంతో స్వాగతిస్తుంది. విభిన్న నృత్య రూపాలు, పాటల నుంచి.. విభిన్నమైన ఆహారం, వస్త్రాల వరకు.. మన దేశం అనేక ప్రత్యేకతలతో నిండింది. అయినా సరే ఇక్కడ ఒకరినొకరు గౌరవించుకుంటూ.. ప్రేమతో ఐక్యమత్యంగా కలిసి ఉంటారు. మీలో కూడా ఇదే స్ఫూర్తి ఉంటే.. 2023లో ఇండియాలో పలు ప్రాంతాల్లో జరిగే ఈ ఐదు సూపర్ ఫన్ సాంస్కృతిక ఉత్సవాలకు హాజరైపోండి. శీతాకాలంలో జరిగే ఈ ఉత్సవాలకోసం ఇప్పటినుంచే మంచి ప్లాన్ వేసుకోండి.

నాగౌర్ ఫెస్ట్

నాగౌర్ ఫెస్ట్ రెండవ అతిపెద్ద పశువుల పండుగ. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. రంగురంగుల దుస్తులు, ఉపకరణాలతో ముస్తాబైన 80,000 పశువులు ఈ ఫెస్ట్‌లో పాల్గొంటాయి.

సంగీతం, జానపద నృత్యం, టగ్ ఆఫ్ వార్, ఒంటెల పందాలు, ఎద్దుల పందాలు, కథలు చెప్పడం, చలిమంటలు, తోలుబొమ్మలాట, కోడిపందాలు, గారడీ వంటి కొన్ని ఆకర్షణీయమైన కార్యకలాపాలు ఇక్కడ ఆకట్టుకుంటాయి. ఇది జనవరి 27-30 మధ్య రాజస్థాన్‌లో జరుగుతోంది.

కచ్ రాన్ ఉత్సవం

ఈ సంవత్సరం దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగే కచ్ రాన్ ఉత్సవం అనేది గుజరాత్‌లోని.. రాన్ ఆఫ్ కచ్ సమీపంలోని ఒక గ్రామంలో 7,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఒక పర్యాటక కార్యక్రమం.

చంద్రకాంతి పడి మెరిసే తెల్లటి ఇసుకతో కూడిన విశాలమైన మైదానంలో 400 గంభీరమైన గుడారాలు, ప్రత్యక్ష సాంస్కృతిక ప్రదర్శనలు, కచ్చి వంటకాలను మీరు ఆనందించవచ్చు. ఈ పండుగ ఫిబ్రవరి 20 వరకు ఉంటుంది.

గోవా కార్నివాల్

ఈ గోవా కార్నివాల్‌కు కులాలు, మతాలు, రంగులు, లింగాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు హాజరవుతారు. అద్భుతమైన ఎక్స్​పీరియన్స్ కావాలనుకునేవారిని ఇది కచ్చితంగా స్వాగితిస్తుంది.

పాడటం, నృత్యం చేయడం నుంచి.. విందులు, ఆడటం, ప్రదర్శనల వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఈ ఫెస్ట్‌లో విదూషకులు, ఫైర్ పెర్ఫార్మర్స్, అక్రోబాటిక్ నిపుణులు, లైవ్ బ్యాండ్‌లు కూడా ఉన్నాయి. ఇవి వేడుకను ఒక స్థాయికి తీసుకువెళతాయి. నాలుగు రోజుల జరిగే ఈ ఫన్ ఫెస్ట్ ఫిబ్రవరి 25న ప్రారంభమవుతుంది.

కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్

ఒడిశాలోని కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ దేశంలోని అతిపెద్ద నృత్యోత్సవాలలో ఒకటి. భారతదేశంలోని సంగీత, నృత్య పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. ఈ సంవత్సరం, ఆలోచనాత్మకంగా నిర్వాహకులు భరతనాట్యం, కథక్, కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలతో సహా ప్రధాన ఆకర్షణలను ప్లాన్ చేశారు.

గిరిజన సంగీతం, ఆహారం, కళలు దీనిలో ప్రధాన ఆకర్షణలు. సాధారణంగా ఈ ఫెస్ట్ డిసెంబర్ 1-5 మధ్య జరిగుతుంది.

హార్న్‌బిల్ పండుగ

హార్న్‌బిల్ ఫెస్టివల్ అనేది ఒక ప్రధాన క్రౌడ్-పుల్లర్. ఇది నాగాలాండ్‌లో మీ పర్యటనను సమయం, శ్రమకు విలువైనదిగా మార్చేస్తుంది. ఈ వార్షిక పండుగ రాష్ట్రంలోని 16 నివాస తెగలు ఆహారం, సంగీతం, కళ, నృత్యం ద్వారా జరుపుకుంటారు.

మీరు జానపద ప్రదర్శనలు, తల-వేట ఆచారాలు, కారు, బైక్ సాహసాలు, ఫ్యాషన్ షోలు, ప్రసిద్ధ మిరపకాయలు తినే పోటీలను ఇక్కడ చూడవచ్చు. ఈ పండుగను డిసెంబర్ 1-10 వరకు జరుపుకుంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం