NTR | ఎన్టీఆర్-కొరటాల సినిమాలో హీరోయిన్ ఆలియా కాదా?
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో రానున్న సినిమాలో ఆలియా భట్ స్థానంలో మరో హీరోయిన్‌ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఆలియా తప్పుకోవడంతో పాపులర్ ఫేస్ కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది.
కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లపై ప్రభావం పడింది. దీంతో కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబోలో రానున్న చిత్రం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆచార్య ప్రభావం ఎన్టీఆర్ చిత్రంపై పడకుండా ఉండేందుకు కొరటాల ఈ సారి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా త్వరలోనే పట్టలేక్కనున్న నేపథ్యంలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌గా మొదట ఆలియా భట్‌ను తీసుకోవాలని చిత్రబృందం అనుకుంది. పాన్ఇండియా సినిమాగా దీన్ని తీసుకురావాలని, భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఆలియా భట్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు మూవీ మేకర్స్.
పాపులర్ నటితో ఈ సినిమా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లేదా.. దక్షిణాదిన సూపర్ ఫామ్‌లో ఉన్న కథానాయిక కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ హీరోయిన్ కాకుండా రెండు చోట్ల పాపులారిటీ ఉన్న హీరోయిన్ కోసమే చిత్రబృందం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పుష్ప, కేజీఎఫ్-2 లాంటి చిత్రాల్లో బాలీవుడ్ హీరోయిన్ నటించలేదు. అయినప్పటికీ ఆ సినిమాలు పాన్ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయ్యాయి. ఇదే ఫార్ములాను కొరటాల శివ ఫాలోఅవుదామని అనుకుంటున్నట్లు సమాచారం.
ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలించారు. మరి వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఈ విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ సరసన నటించబోయే ఆ పాపులర్ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్