Shaakuntalam In OTT : సైలెంట్‌గా ఓటీటీలో విడుదలైన శాకుంతలం
Shaakuntalam Released OTT : సమంతా నటించిన 'శాకుంతలం' సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. సమంతా అభిమానులకు కూడా చిత్రం నచ్చలేదు. ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా OTTలో విడుదలైంది.
పౌరాణిక కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పౌరాణిక కథాంశంతో తీసిన సినిమాలు కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి. సమంతా రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) సినిమా ‘శాకుంతలం’ పరిస్థితి కూడా అదే. కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. థియేటర్లలో భారీ వసూళ్లను రాబడుతుందని అంతా భావించారు. కానీ అంచనాలు రివర్స్ అయ్యాయి.
శాకుంతలం సినిమా(Shaakuntalam Cinema) ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేదు. ఇప్పుడు ఈ సినిమా OTTలోకి వచ్చింది. సినిమా హిట్ కాకపోవడంతో కావచ్చు.. పెద్దగా ప్రచారం లేకుండానే సైలెంట్ గా ఓటీటీ(OTT)లో విడుదల చేసేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో ఈ సినిమా ప్రసారం అవుతోంది.
శాకుంతలం పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమైంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైంది. ఇప్పుడు అన్ని భాషల్లో OTT ద్వారా చూసేందుకు అందుబాటులో ఉంది.
సమంతా రూత్ ప్రభు సినిమా కావడంతో భారీ స్థాయయిలో వసూళ్లు వస్తాయని నిర్మాతలు భావించారు. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం హిట్ కాలేదు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతంలో రెండంకెలకు చేరుకోలేకపోయింది. 3 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేదు. ఓటీటీ ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలిక.
ఈ సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) కూతురు అల్లు అర్హ(Allu Arha) కూడా నటించింది. గుణశేఖర్(Gunashekar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కొన్ని గ్రాఫిక్స్‌తో ఉన్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కానీ జనాలకు సినిమా కనెక్ట్ కాలేదు. ఈ ఓటమి బాధను మరిచిపోయేందుకు సమంతా తర్వాత ప్రాజెక్టులపై దృష్టి సారించింది.