Pushpa 2 The Rule: పుష్ప 2 మేకర్స్ చెప్పిన సర్‌ప్రైజ్ ఇదేనా?-pushpa 2 the rule first single second promo may out before full song release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 The Rule: పుష్ప 2 మేకర్స్ చెప్పిన సర్‌ప్రైజ్ ఇదేనా?

Pushpa 2 The Rule: పుష్ప 2 మేకర్స్ చెప్పిన సర్‌ప్రైజ్ ఇదేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 25, 2024 10:42 PM IST

Pushpa 2 The Rule - First Song: పుష్ప 2 సినిమా నుంచి ఇటీవల మొదటి పాట ప్రోమో వచ్చేసింది. ఇప్పటికే ఈ ప్రోమో మోతెక్కిపోతోంది. అయితే, పూర్తి పాట రిలీజ్‍కు ముందే ఓ సర్‌ప్రైజ్ తీసుకురానున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. ఆ సర్‌ప్రైజ్ ఏంటో సమాచారం బయటికి వచ్చింది.

Pushpa 2 The Rule: పుష్ప 2 మేకర్స్ చెప్పిన సర్‌ప్రైజ్ ఇదేనా?
Pushpa 2 The Rule: పుష్ప 2 మేకర్స్ చెప్పిన సర్‌ప్రైజ్ ఇదేనా?

Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. పాన్ ఇండియా రేంజ్‍లో సినీ జనాలు ఈ చిత్రం కోసం వేయికళ్లతో వేచిచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం నుంచి తొలి పాట రెడీ అయింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ ఈ పాట ప్రోమో కూడా ఇటీవల వచ్చింది. అయితే, ఈ ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సర్‌ప్రైజ్ ఇస్తామని మూవీ టీమ్ (ఏప్రిల్ 25) చెప్పింది.

పుష్ప 2: ది రూల్ చిత్రం నుంచి ‘పుష్ప..పుష్ప’ అనే తొలి పాట మే 1వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో వచ్చింది. పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్ అంటూ ఉన్న ఈ ప్రోమో సోషల్ మీడియాలో మోతెక్కిపోతోంది. ఈ చిన్న ప్రోమోనే సత్తాచాటుతోంది. దీంతో ఫుల్ సాంగ్ వస్తే ఏ రేంజ్‍లో హిట్ అవుతుందోననే అంచనాలు ఉన్నాయి. అయితే, మే 1వ తేదీన ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సెన్సేషనల్ సర్‌ప్రైజ్ తెస్తామని మూవీ టీమ్ పేర్కొంది.

సర్‌ప్రైజ్ ఇదేనా..!

పుష్ప.. పుష్ప పాటకు సంబంధించి రెండో ప్రోమోను కూడా పుష్ప 2 మూవీ టీమ్ తీసుకురానుందని తెలుస్తోంది. ఈ వీకెండ్‍లోనే మరో మూడు రోజుల్లోగా ఈ ప్రోమోను రిలీజ్ చేస్తుందని టాక్ బయటికి వచ్చింది. మూవీ టీమ్ చెబుతున్న సర్‌ప్రైజ్ ఇదేనని తెలుస్తోంది. ఫస్ట్ సాంగ్ రెండో ప్రోమోకు సంబంధించి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రోమోలో అల్లు అర్జున్ సిగ్నేచర్ తగ్గేదెలే మూవ్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరి మూవీ టీమ్ ఏం తీసుకొస్తుందో చూడాలి.

మూడేళ్ల కిందట వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో బాక్సాఫీస్‍ను షేక్ చేసిన పుష్పకు సీక్వెల్‍గా ఇప్పుడు పుష్ప 2: ది రూల్ మూవీ వస్తోంది. ఈ సీక్వెల్ మూవీని మరింత భారీగా రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్. దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న పుష్ప 2 కలెక్షన్ల రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు మెండుగా ఉన్నాయి. ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

బాలీవుడ్ సినిమాలకు మించి..

పుష్ప 2 సినిమాకు తెలుగుతో సమానంగా హిందీలోనూ ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో ఈ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను ఏఏ ఫిల్మ్స్ ఏకంగా రూ.200కోట్లకు తీసుకుంది. దీంతో ఉత్తరాది థియేట్రికల్ రైట్స్ విషయంలో బాలీవుడ్ చిత్రాలను కూడా బీట్ చేసి పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 15న తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో పుష్ప 2 రిలీజ్ కానుంది.

పుష్ప 2: ది రూల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. త్వరలోనే చిత్రీకరణ ముగియనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

IPL_Entry_Point