Pan Global song Released: పాన్ గ్లోబల్ సాంగ్ వచ్చేసింది.. లిరిక్స్ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు..!-pan global song out now from dochevarevarura movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pan Global Song Released: పాన్ గ్లోబల్ సాంగ్ వచ్చేసింది.. లిరిక్స్ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు..!

Pan Global song Released: పాన్ గ్లోబల్ సాంగ్ వచ్చేసింది.. లిరిక్స్ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు..!

Maragani Govardhan HT Telugu
Sep 30, 2022 04:23 PM IST

Shivanageshwara Rao Pan Global Song: శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన తాజా చిత్రం దోచేవారెవరురా. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కటంటే ఒక్క ముక్క కూడా అర్థం కానీ రీతిలో ఈ పాటను రాశారు శివనాగేశ్వరరావు.

<p>దోచేెవారెవరురా నుంచి సాంగ్ వచ్చేసింది</p>
దోచేెవారెవరురా నుంచి సాంగ్ వచ్చేసింది (Twitter)

Pan Global song from Dochevaarevarura: టాలీవుడ్‌లో కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నాగేశ్వరరావు. మనీ, సిసింద్రి, పట్టుకోండి చూద్దాం లాంటి సూపర్ హిట్లను తెరకెక్కించిన ఆయన నుంచి త్వరలో ఓ సినిమా రాబోతుంది. అదే దోచేవారెవరురా. ప్రముఖ పాటల రచయిత చైతన్య ప్రసాద్ ప్రణవ్ చంద్ర ఇందులో హీరోగా చేస్తుండగా.. మాళవిక సతీశన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పాట విడుదలైంది. ఒక్కటంటే ఒక్క పదం కూడా అర్థం కానీ విధంగా శివ నాగేశ్వరరావు ఈ సాంగ్‌ను రాశారు.

కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న దోచేవారెవరురా సినిమాలో ఈ గ్లిబ్బరిష్ సాంగ్ మంచి హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ విచిత్రంగా ఉండటమే కాకుండా.. వినూత్నంగా అనిపిస్తోంది. ప్రముఖ సహాయక నటుడు అజయ్ ఘోష్, ప్రణవి సాధనాలపై తెరకెక్కించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా.. క్యాచీ పదాలను ఇందులో కూర్చి పాటను రాశారు శివనాగేశ్వరరావు. అంతేకాకుండా ఈ పాటను పాన్ గ్లోబల్ సాంగ్‌గా విడుదల చేయడం విశేషం.

"నేను రాసిన ఈ పాట గ్లిబ్బరిష్ కాదు. ఇందులోని పదాలు కైక్సేనా భాషకు చెందినవి. ప్రస్తుతం ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి ఈ భాషను మాట్లాడుతున్నాడు. పాటలోని చాలా పదాలు ఈ భాషలో నుంచి తీసుకుని రాశాను. ఏదో అసందర్భంగా ఇష్టమొచ్చినట్లు రాసినవి కాకుండా.. ఈ పాటలోని ప్రతి పదానికి ఓ అర్థముంది. త్వరలోనే ఈ పాటను తెలుగులోకి డబ్ చేస్తాం. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది. ప్రస్తుతానికి నాకు, ఈ భాష మాట్లాడే ఏకైక వ్యక్తికి తప్ప మరొకరికి అర్థం కాదు. అందుకే దీన్ని నేను పాన్ గ్లోబల్ సాంగ్ అని అంటున్నాను." అని శివనాగేశ్వరరావు స్పష్టం చేశారు.

శివనాగేశ్వరారవు రాసిన ఈ పాటను ప్రముఖ గాయకులు మనో, సునయన అద్భుతంగా ఆలపించారు. ఈ డ్యూయెట్‌లో నటించిన అజయ్ ఘోష్, ప్రణవి కూడా అద్భుతమైన హవాభావాలతో ఆకట్టుకున్నారు. చూసేందుకు కామెడీ సాంగ్‌లా అనిపిస్తోంది. రోహిత్ వర్ధన్ ఈ సాంగ్‍కు సంగీతాన్ని సమకూర్చాడు.

బొడ్డు కొటేశ్వరరావు అనే ఎన్ఆర్ఐ నిర్మించిన ఈ సినిమాకు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబరులోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బిత్తిరి సత్తి ప్రొఫెషనల్ కిల్లర్‌గా నటిస్తున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం