Thank You Teaser |లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్న నాగచైతన్య...థాంక్యూ టీజర్ రిలీజ్ -naga chaitanya thank you movie official teaser out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thank You Teaser |లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్న నాగచైతన్య...థాంక్యూ టీజర్ రిలీజ్

Thank You Teaser |లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్న నాగచైతన్య...థాంక్యూ టీజర్ రిలీజ్

HT Telugu Desk HT Telugu
May 25, 2022 05:24 PM IST

నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న థాంక్యూ సినిమా టీజ‌ర్ ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. క్లాస్, మాస్ వర్గాలను ఆకట్టుకునేలా డిఫ‌రెంట్ లుక్ లో నాగ‌చైత‌న్య ఈ టీజర్ లో క‌నిపిస్తున్నారు. విజువ‌ల్స్,డైలాగ్స్ ఆస‌క్తిని పంచుతున్నాయి.

<p>నాగ‌చైత‌న్య</p>
నాగ‌చైత‌న్య (twitter)

మ‌నం రూపంలో నాగ‌చైత‌న్య‌ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని సినిమాను అందించాడు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్. ఈ విజయం అనంతరం దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మ‌ళ్లీ నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కె కుమార్ క‌లిసి చేస్తున్న చిత్రం థాంక్యూ. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా టీజ‌ర్ ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది. నా సక్సెస్ నేనే కారణం అంటూ నాగచైతన్య ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ తో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. నీకు తప్ప నీ లైఫ్ లో ఇంకొకరికి చోటు లేదు అని రాశీఖన్నా కన్నీళ్లతో డైలాగ్ చెప్పగానే నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కొత్త లుక్ లుక్ కనిపించడం ఆకట్టుకుంటోంది. 

అవికాగోర్,మాళవికా నాయర్ తో పాటు  మరో హీరోయిన్ రాశీఖన్నాతో నాగచైతన్య కెమిస్ట్రీని టీజర్ లో చూపించారు.  లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎన్నో వదలుకొని ఇక్కడకు వచ్చాను...నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమిది అంటూ టీజర్ లో నాగచైతన్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

బిజినెస్ మెన్ , హాకీ ప్లేయర్,స్టూడెంట్ గా డిఫరెంట్ లుక్స్ లో నాగచైతన్య కనిపిస్తున్నారు. మాస్ తో పాటు క్లాస్ వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమాను రూపొందించినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది.  టీజ‌ర్ లోని డైలాగ్స్‌, విజువ‌ల్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.  ఇందులో రాశీఖ‌న్నా, మాళ‌వికానాయ‌ర్‌, అవికాగోర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. 

పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ ర‌వి క‌థ‌ను అందిస్తున్నారు. జూలై 8న వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఓ యువ‌కుడి జీవితంలోని భిన్న ద‌శ‌ల‌ను ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. 

 

Whats_app_banner

సంబంధిత కథనం