Guppedantha Manasu May 3rd Episode: ధరణిని మరింత ఇబ్బంది పెడుతున్న శైలేంద్ర.. అతడి నటనను పసిగట్టిన జగతీ-guppedantha manasu 2023 may 3rd episode dharani upset with shailendra behavior ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu 2023 May 3rd Episode Dharani Upset With Shailendra Behavior

Guppedantha Manasu May 3rd Episode: ధరణిని మరింత ఇబ్బంది పెడుతున్న శైలేంద్ర.. అతడి నటనను పసిగట్టిన జగతీ

Maragani Govardhan HT Telugu
May 03, 2023 08:52 AM IST

Guppedantha Manasu May 3rd Episode: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్‍‌లో శైలేంద్ర తన ప్రవర్తనతో ధరణిని మరింత బాధపెడతాడు. తమ మధ్య దూరాన్ని బయటకు చెప్పకూడదని హెచ్చరిస్తాడు. ఇదంతా జగతీ వింటుంది. మరోపక్క రిషి.. ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ ప్లాన్‌తో వస్తాడు.

ధరణిని మరింత ఇబ్బంది పెడుతున్న శైలేంద్ర.. అతడి నటనను పసిగట్టిన జగతీ
ధరణిని మరింత ఇబ్బంది పెడుతున్న శైలేంద్ర.. అతడి నటనను పసిగట్టిన జగతీ

Guppedantha Manasu May 3rd Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో శైలేంద్ర కాలేజ్‌కు వచ్చి తన తండ్రి ఫణీంద్రకు క్యాబిన్ లేకపోవడాన్ని ప్రశ్నిస్తాడు. ఇందుకు జగతీ తన క్యాబిన్ ఇస్తానన్న కానీ.. ఫణీంద్ర అందుకు ఒప్పుకోడు. రిషి అవసరమైతే తన సీటే ఇస్తాడని ఫణీంద్ర అంటాడు. అనంతరం రిషీ.. ఎండీ సీటులో శైలేంద్రను కూర్చోబెడతాడు. ఆ సీటులో అతడిని కూర్చోబెట్టడం జగతీ, వసుకు నచ్చదు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ సీటులో మీరు తప్పా మరొకరు కూర్చోవడానికి నాకు నచ్చలేదంటూ వసు తన అసంతృప్తి తెలియజేస్తుంది. ఇందుకు రిషి.. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇందులో అన్నయ్య కూర్చున్నాడని ఫీలవ్వద్దని, మనమంతా ఒక్కటే అంటాడు. ఇందుకు వసు ఈ సీజులో మీకు తప్పా కూర్చోవడానికి మీకు మాత్రమే అర్హత ఉందని చెబుతుంది.

ఎండీ సీటులో మీరే కూర్చోవాలి: వసు

సార్‌కు నా క్యాబిన్ ఇస్తానని, నాకు అవసరం లేదని, మీ పక్కనే కూర్చుంటానని వసు.. రిషితో చెబుతుంది. దయచేసి ఈ సీటులో ఇంకెవరినీ కూర్చోబెట్టవద్దంటూ స్పష్టం చేస్తుంది. ఇందుకు రిషి బదులిస్తూ.. గౌరవం, అర్హతలు మనం కూర్చునే సీటులో ఉండవు.. మనం చేసే పనులను బట్టి ఉంటాయని చెబుతాడు. అన్నయ్యను ఒక్క క్షణం కూర్చోబెడితేనే అంత ఫీలవుతున్నావ్.. ఒకవేళ అంతకుమించి జరిగితే ఏం చేస్తావ్ అంటూ ప్రశ్నిస్తాడు. ఇందుకు వసు తట్టుకోలేను సార్ అంటుంది. తట్టుకోవాలి వసుధార.. లైఫ్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదాని చెబుతాడు. లైఫ్‌లో కష్ట, నష్టాలు అన్నీ ఉంటాయని, అన్నింటినీ తీసుకోవాలి చెబుతాడు రిషి. అవన్నీ నాకు తెలియదు సార్.. మీరు మాత్రం ఈ కూర్చిలోనే ఉండాలి. లేకుంటే ఈ పొగరు హర్ట్ అవుతందని వసు అంటుంది. అనంతరం వసును రిషిని ఓదార్చి తప్పుకుండా నువ్వు కోరుకున్నట్లే ఉంటానని హామీ ఇస్తాడు.

శైలేంద్రను అనుమానించడం ప్రారంభించిన జగతీ..

సీన్ కట్ చేస్తే జగతీ.. ఆఫీసులో శైలేంద్ర.. క్యాబిన్ గురించి చేసిన హడావిడి గురించి ఆలోచిస్తుంటుంది. ఇంతలో మహేంద్ర వచ్చి.. మన భూషణ్ ఫ్యామిలీకి రిషి గొప్ప గర్వకారణం.. అతడు ఎప్పుడూ ఇలాగే ఉండాలని అంటాడు. అందుకు జగతీ.. ఇవన్నీ మాటలే అయితే అని ప్రశ్నిస్తుంది? శైలేంద్ర క్యాబిన్ విషయంలో కావాలని గుచ్చి అడిగినట్లు నాకు అనిపిస్తుందని మహేంద్రతో అంటుంది. ఇందుకు మహేంద్ర.. శైలేంద్ర చాలా మంచివాడని, తను మా వదినలా కాదని జగతీకి నచ్చజెబుతాడు. ఇందుకు జగతీ కూడా అయిష్టంగానే అలా కాకూడదనే ఆశిద్దామని అక్కడ నుంచి కిచెన్‌లోకి ధరణికి సాయం చేద్దామని వెళ్తుంది.

ధరణికి శైలేంద్ర వార్నింగ్..

కిచెన్‌లో ధరణి వంట పనులు చేస్తుండగా.. వసుధార వచ్చి.. ఎప్పుడు ఏదోక పని చేస్తూ ఉంటారు ఏంటి మేడమ్. అప్పుడప్పుడు బయటకు వెళ్లడం, టీవీ చూడటం లాంటివి చేయొచ్చుగా అని ధరణితో అంటుంది. పక్కన రిషి కూడా ఉంటాడు. ఇంతలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శైలేంద్ర.. నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను ధరణి.. లైఫ్‌ను ఎంజాయ్ చేయమని ధరణికి కొంచెం నెర్పించవచ్చు కదా అని వసుధారను అడుగుతాడు. కావాలంటే ధరణికి నువ్వు నెర్పించదానికి నీకు ఫీజు కూడా పే చేస్తాను అని శైలేంద్ర అంటాడు. ఇందుకు రిషి కూడా శైలేంద్రకు వంత పాడతాడు. వసుకు నాకు చాలా నేర్పించిందని, వసుధార నాకు చాలా సపోర్ట్ చేసిందని, అందుకు వదినకు కూడా ఆమె పర్ఫెక్ట్ గురువును అంటాడు. ఇందుకు శైలేంద్ర స్పందిస్తూ.. వసుధార నుంచి నేను కూడా చాలా నేర్చుకోవాలి అయితే అని అంటాడు. వెంటనే వసు అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నాకు నేర్పించడానికి మీ అన్నయ్య ఉన్నాడు కదా.. ఆయన నేర్పిస్తాడులే వసు ఎందుకు? అని రిషితో అంటుంది ధరణి.

శైలేంద్ర నటనను తెలుసుకున్న జగతీ..

ధరణి మాటలకు కోపంతో ఊగిపోయిన శైలేంద్ర.. రిషి వెళ్లిపోయిన తర్వాత ఆమె వద్దకు వచ్చి వార్నింగ్ ఇస్తాడు. ప్రేమను పంచడం చేతకాదు.. కనీసం ప్రేమను నటించమని అంటాడు. మన మధ్య ఉన్న దూరం మన మధ్యే ఉండాలి. అంతేకానీ కాదు కూడదని బయట పెట్టకు అది నీకే మంచిది కాదని ధరణిని బాధపెట్టి అక్కడ నుంచి వెళ్తాడు. ఇదంతా పక్క నుంచి జగతీ వింటుంది. ధరణి మాత్రం శైలేంద్ర మాటలకు కంటనీరు పెట్టుకుంటుంది. జగతీ కూడా అక్కడ నుంచి బాధతో వెళ్లిపోతుంది.

వసుకు సారీ చెప్పిన రిషి..

సీన్ కట్ చేస్తే రిషి.. వసు గుడ్ నైట్ చెప్పలేదని అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఏది వసుధార నా గుడ్ నైట్ అని ఆమెకు మెసేజ్ చేస్తాడు. ఇందుకు వసు నో గుడ్ నైట్... యాంగ్రీ నైట్ సార్ అంటూ రిప్లయి ఇస్తుంది. ఎందుకని రిషి ప్రశ్నిస్తాడు..అదంతే సార్.. తన కోపానికి కారణమేంటో మీరే గ్రహించాలంటూ మెసేజ్ చేస్తుంది. నేను ఈ పొగరును ఏమి అనలేదని అనుకుంటాడు. తెలియడం లేదని మళ్లీ మెసెజ్ చేస్తాడు. మీరు జెంటిల్మెన్ కదా సార్.. కనుక్కోండి అంటూ వసు మెసేజ్ పెడుతుంది. అనంతరం రిషి ఆలోచనలో పడతాడు. గోళీలు తీసుకుని సారీ అని వచ్చేలా అరేంజ్ చేస్తాడు. వెంటనే ఆ పిక్చర్‌ను వసుధారకు పంపిస్తాడు. వెంటనే వసు వీడియో కాల్ చేస్తుంది.

రిషి-వసు రోమాంటిక్ టాక్..

రిషి-వసు ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. నాకు కోపం ఎందుకో వచ్చిందో తెలుసా? అని అడుగుతుంది. ఏంటని అడుగుతాడు. మీరు నాపై నిందలు వేశారని చెబుతుంది. ప్రేమ అంటే ఏంటో, ఆ బంధం గురించి నేర్పింది మీరు కదా సార్.. కానీ మీరు మా అన్నయ్యతో నేను నేర్పించానని అన్నారెందుకు అని రిషిని ప్రశ్నిస్తుంది. ఇందుకు రిషి ఇందుకా నీకు కోపం వచ్చింది? అంటూ నవ్వుతుంటాడు. దీనికి కోప్పపడితే ఎలా వసు అంటాడు. సార్ మీరు నవ్వు ఆపకండి అంటూ అతడిని అలాగే చూస్తుంటుంది వసు. మీరు నవ్వుతూ ఉంటే ఇంకా చూడాలని ఉందని అంటుంది. ఇప్పుడు నీ కోపం పోయింది కదా అనగా.. అవును సార్ అంటూ వసు చెబుతుంది. అనంతరం ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకుని పడుకుంటారు.

అనంతరం మెడికల్ కాలేజ్ గురించి ఫణీంద్ర, జగతీ, శైలేంద్ర, వసు, మహేంద్రతో కలిసి రిషి మీటింగ్ పెడతాడు. టెండర్ల పిలుద్దామని అంటాడు. ముందు బడ్జెట్ ఎంతో అంచనా వేసుకుంటే బెటర్ అని ఫణీంద్ర అనగా.. నేను బడ్జెట్ ప్రిపేర్ చేశానని రిషి చెబుతాడు. ఎంత అని అడుగ్గా.. 10 కోట్లు అని అంటాడు. అంత క్యాష్ మనదగ్గరలేదుగా అని ఫణీంద్ర అడుగ్గా.. 7 కోట్లు ఉందని.. మిగిలినది ఫైనాన్షియర్ల నుంచి అడ్జస్ట్ చేద్దామని రిషి అంటాడు. ఇంతలో మినిస్టర్ ఫోన్ చేసి.. రిషిని అభినందిస్తాడు. మిషన్ ఎడ్యూకేషన్ ప్రాజెక్టును మెడికల్ కాలేజ్‌కు కనెక్ట్ చేయడం అద్బుతమని పొగుడుతాడు. ఇందుకు రిషి కూడా థ్యాంక్స్ చెబుతాడు.

రిషి ఫ్రీ ఎడ్యూకేషన్ ప్లాన్..

మీ పర్మీషన్‌తో నేనొక నిర్ణయం తీసుకున్నానని మినిస్టర్‌తో అంటాడు రిషి. ఏంటో చెప్పమని అడుగ్గా.. నేను ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ ఇద్దామనుకుంటున్నానని, అందుకు నాకు మంచి ప్లాన్ ఉందని అంటాడు. ఆ మాటకు అక్కడున్న మహేంద్ర, ఫణీంద్ర, జగతీ అంతా షాక్ అవుతారు. మంచి ప్లాన్ అయినా ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ కష్టం కదా అని మినిస్టర్ అంటాడు. నేను ఇంకా మా టీమ్‌తో డిస్కస్ చేయలేదని, తర్వాత మీకు డీటేల్డ్‌గా వసుధార వచ్చి వివరిస్తుందని రిషి అంటాడు. సరేనని మినిస్టర్ ఫోన్ కట్ చేస్తారు.

ఫ్రీ మెడికల్ ఎడ్యూకేషన్ సాధ్యమేనా రిషి అంటూ ఫణీంద్ర రిషిని అడుగుతాడు. అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, అంత ఈజీ కాదని మహేంద్ర అంటాడు. డాడ్ నాదోక ఐడియా ఉంది అదే ఆలోచిస్తున్నాను అని రిషి చెబుతాడు. డాక్టర్ మేక్స్ డాక్టర్ అనే ఓ థీమ్‌తో చాలా మంది వైద్యులను సంప్రదించాను. మన దేశంలో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రంలో ఎంతో మంది సెటిలైన తెలివైన డాక్టర్లు ఉన్నారు. వాళ్లందరూ ఒక్కొక్కరు ఒక్కో పేద విద్యార్థిని సపోర్ట్ చేస్తే సరిపోతుందని చెప్పాను. అందుకు దాదాపు అందరూ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. కచ్చితంగా సపోర్ట్ చేస్తామని అన్నట్లు రిషి చెప్పడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

IPL_Entry_Point