ప్రస్తుతం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చాలా బిజీగా ఉన్నాడు. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు ఇప్పటికే సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలు కాకుండా హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. చాలా కారణాలతో ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. ఇంతలోనే సంచలన దర్శకుడితో పవన్ సినిమా చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి.
'విక్రమ్' సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో పవన్ కల్యాణ్ చేతులు కలిపాడని ప్రచారం జరిగింది. నిజంగా పవన్ కల్యాణ్ ని లోకేష్ డైరెక్ట్ చేస్తుంటే ఫ్యాన్స్ మాత్రం అస్సలు తగ్గరు. చాలా అంచనాలు ఉంటాయి. వాస్తవం ఏంటంటే.. పవన్ కల్యాణ్ లోకేశ్ తో ఏ సినిమాకి సైన్ చేయలేదు. పవన్, లోకేశ్ సినిమా(Pawan Lokesh Cinema) అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం.
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లేలోపు చేతిలో ఉన్న సినిమాలన్నింటిని పూర్తి చేయాలని చూస్తున్నాడు. కొత్త ప్రాజెక్ట్‌కి సైన్ చేసే మూడ్‌లో లేడు. మరోవైపు లోకేష్ కనగరాజ్-విజయ్ లియోతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రజనీకాంత్(Rajinikanth)తో ఒక చిత్రానికి కమిట్ అయ్యాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కాబోతున్న కైతి 2 తర్వాత విక్రమ్ 3 సినిమా చేయనున్నాడు. భవిష్యత్‌లో పవర్‌ఫుల్ కాంబినేషన్ రావచ్చు. పవన్ కల్యాణ్‌ను లోకేష్ డైరెక్ట్ చేస్తే దానిపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ రూమర్ తప్ప మరేమీ కాదు.
వచ్చే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు(Elections) జరగనున్నాయి. అందుకే ఈ ఏడాది చివరికల్లా వీలైనన్ని ఎక్కువ సినిమాలను ముగించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నాడు. తాను జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటానని కూడా ప్రకటించాడు. అందుకే ఈసారి ఎన్నికలపై సీరియస్ గా కాన్సంట్రేషన్ పెట్టి తన సినిమాలు, రాజకీయాలకు పక్కాగా ప్లాన్స్ చేసుకుంటున్నాడు.
మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు(Hair Hara Veeramallu) చిత్రం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇది 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతానికి సినిమాను పూర్తి చేసేందుకు పవన్ ఆసక్తి చూపడం లేదట. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని క్రిష్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పూర్తయిన సినిమాని మొదటి పార్ట్‌గా రిలీజ్ చేసి, మిగిలిన షూటింగ్ తర్వాత, ఎన్నికల తర్వాత రెండో పార్ట్‌ని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ రెండు భాగాల ప్లాన్‌కు పవన్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజిత పొన్నాడ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. హరి హర వీర మల్లు చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం సమకూరుస్తున్నాడు.