Bandla Ganesh: తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. బండ్లన్న కౌంటర్ ఎవరికిచ్చారు?
బండ్ల గణేశ్ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొంతమంది ఆ ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశాడని భావిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబును ఉద్దేశించి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమా ట్రైలర్ గురవారం నాడు విడుదలై వ్యూస్ పరంగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విజయ్ సహా పూరీ జగన్నాథ్, హీరోయిన్ అనన్యా పాండే, కరణ్ జోహార్ తదితరులు హైదరాబాద్ వచ్చి ఇక్కడ రౌడీ హీరో ఫాలోయింగ్‌కు ఫిదా అయ్యారు. అంతేకాకుండా విజయ్ అభిమానులు.. తమ హీరోకు
భారీ కటౌట్ పెట్టి పూలమాలలతో పాటు పాలాభిషేక్ చేసి నానా హడావిడి చేశారు. ఫ్యాన్స్ సందడి చూసి విజయ్ ఫిదా అయ్యాడు. దీంతో అదిరిపోయే స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు.
"మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజై రెండేళ్లు అవుతుంది. విడుదలైన సినిమా కూడా పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. అయినా ట్రైలర్‌కు ఈ రచ్చ ఏందిరా నాయన. అందుకే ఆగస్టు 25 ఇండియాను లైగర్ షేక్ చేయడానికి వస్తుంది" అంటూ విజయ్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాడు. అయితే విజయ్ స్పీచ్ చూసిన చాలా మంది మెగా హీరోలను ఉద్దేశించే కామెంట్లు చేశాడనే ఆరోపణలు వచ్చాయి.
తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ విజయ్‌కు కౌంటర్ ఇచ్చినట్లు ఉంది. "తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్ బాబులా, రామ్‌చరణ్, ప్రభాస్‌లా, గుర్తు పెట్టుకో బ్రదర్" అంటూ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృతంగా హల్చల్ చేస్తోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
ఈ ట్వీట్ బండ్ల గణేశ్ కావాలనే విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశాడని, అతడికి కౌంటర్ ఇచ్చిన ఉందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, మహేశ్ బాబులను విమర్శించినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తన ఒక్క ట్వీట్‌తో అందరి హీరోలపై ఘాటు వ్యాఖ్యలను చేశారు బండ్ల గణేశ్. ఎవరికి ఆయన కౌంటర్ ఇచ్చారనేది అర్థం కావట్లేదని నెటిజన్లు అంటున్నారు.
సంబంధిత కథనం