Prabhas Unstoppable: ప్రభాస్ ఫేవరేట్ డైరెక్టర్ అతడే - అన్‌స్టాపబుల్ షోలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన డార్లింగ్
Prabhas Unstoppable: అన్‌స్టాపబుల్ షోలో తన పెళ్లితో పాటు సినిమాల గురించి ప్రభాస్ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. పెళ్లి ఎప్పుడన్నది తనకే క్లారిటీ లేదని పేర్కొన్నాడు.
Prabhas Unstoppable:బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్నఅన్‌స్టాపబుల్ షోకు స్టార్‌హీరో ప్రభాస్ గెస్ట్‌గా హాజరయ్యాడు. తొలుత ఈ ఎపిసోడ్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఒకరోజు ముందుగానే ఆహా సంస్థ ప్రభాస్ ఎపిసోడ్‌ను రిలీజ్ చేసింది. ఇందులో తన ప్రభాస్ కెరీర్‌తో పాటు పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు ప్రభాస్. పెళ్లి ప్రశ్నతోనే ఈ ఎపిసోడ్‌ను మొదలుపెట్టారు బాలకృష్ణ. పెళ్లి ఉందా లేదా...ఒంటరిగానే ఉండాలని అనుకుంటున్నావా అని బాలకృష్ణ ప్రశ్న అడిగాడు.
పెళ్లి చేసుకుంటాను... కానీ ఇంకా రాసిపెట్టలేదేమో అంటూ ప్రభాస్ సమాధానం చెప్పాడు. పెళ్లి విషయంలో ఇంట్లో ఎలా మ్యానేజ్ చేస్తున్నావని బాలకృష్ణ అడిగిన మరో ప్రశ్నకు... ఇంటికి దగ్గరలోనే సిస్టర్, వదిన వాళ్లు ఉండటంతో పెళ్లి ఒత్తిడి పెద్దగా లేదని సరదాగా ప్రభాస్ సమాధానం చెప్పాడు.
ఆ తర్వాత ఏ ధైర్యంతో ఒంటరిగా మిగిలిపోవాలని ఫిక్సయ్యావు బాలకృష్ణ అనగా...తాను అలా ఫిక్స్ కాలేదని ప్రభాస్ చెప్పడం నవ్వులను పంచుతోంది. పెళ్లి ఎప్పుడన్నది తనకే క్లారిటీ లేదని ప్రభాస్ చెప్పడం ఆసక్తిని పంచుతోంది. ఆ తర్వాత సినిమాల గురించి ప్రభాస్‌ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఏ దర్శకుడితో పనిచేయాలని ఉందని అడిగిన ప్రశ్నకు మణిరత్నం అని సమాధానం చెప్పాడు ప్రభాస్. దర్శకుడు బాపు ఇష్టమని అన్నాడు.
వర్షం సినిమాను బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు పోటీగా రిలీజ్ చేశామని, పోటీ కష్టమని తాను అనుకున్నానని, కానీ నిర్మాత ఎం.ఎస్ రాజు మాత్రం వినకుండా విడుదలచేశాడని అన్నాడు.
ఛత్రపతి సమయంలో ఇంటర్వెల్ సీన్‌లో జనాలు ఎక్కువగా ఉండటంతో మొహమాటంతో డైలాగ్ గట్టిగా చెప్పలేకపోయానని అన్నాడు. రాజమౌళి అందుకు అంగీకరించాడని ప్రభాస్ చెప్పాడు. అప్పటి నుంచి ఏ సినిమా అయినా జనాలు ఎక్కువగా ఉంటే సైలెంట్‌గా డైలాగ్ చెప్పేస్తూవచ్చానని పేర్కొన్నారు. ఛత్రపతి వల్ల రాజమౌళిని అందరూ డైరెక్టర్స్ తిట్టుకుంటున్నారని పేర్కొన్నాడు.
మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆరు నెలలు షూటింగ్ పూర్తయిన తర్వాత క్లైమాక్స్ అనుకున్న విధంగా రాకపోవడంతో మూడు నెలలు తిరిగి రీషూట్ చేశామని చెప్పాడు