వరల్డ్ కప్ 2023 స్క్వాడ్స్, వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్స్, World Cup Squad News in Telugu - HT Telugu
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  వరల్డ్ కప్ ఓవర్‌వ్యూ  /  వరల్డ్ కప్ ఇండియా టీమ్ స్క్వాడ్

వరల్డ్ కప్ ఇండియా టీమ్ స్క్వాడ్


ఐసీసీ వరల్డ్ కప్ 2023లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. 8 టీమ్స్ నేరుగా అర్హత సాధించగా.. రెండు టీమ్స్ అర్హత టోర్నీ ద్వారా ప్రధాన టోర్నీలోకి వచ్చాయి. ఆతిథ్య ఇండియాతోపాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, కిందటిసారి రన్నరప్ న్యూజిలాండ్, ఐదు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ ఛాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకతోపాటు సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ ఈసారి ఐసీసీ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నాయి.

అక్టోబర్ 5న ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ 15 మందితో కూడిన జట్లను అనౌన్స్ చేశాయి. ఆస్ట్రేలియా తమ బలమైన జట్టును ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించింది. అలాగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంకలాంటి టీమ్స్ కూడా తమ జట్లను ప్రకటించాయి.

ఇండియా కూడా వరల్డ్ కప్ 2023 కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులోకి గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్లకు కూడా టీమ్ లో చోటు దక్కింది. సంజూ శాంసన్, యుజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్ లాంటి ప్లేయర్స్‌కు చోటు దక్కలేదు.

వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికైన వాళ్లలో అక్షర్ పటేల్ గాయపడగా.. శ్రేయస్ అయ్యర్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నారు.

  • India
  • Rohit Sharma
    Rohit SharmaBatsman
  • Shreyas Iyer
    Shreyas IyerBatsman
  • Shubman Gill
    Shubman GillBatsman
  • Suryakumar Yadav
    Suryakumar YadavBatsman
  • Virat Kohli
    Virat KohliBatsman
  • Ravichandran Ashwin
    Ravichandran AshwinAll-Rounder
  • Ravindra Jadeja
    Ravindra JadejaAll-Rounder
  • Shardul Thakur
    Shardul ThakurAll-Rounder
  • Ishan Kishan
    Ishan KishanWicket Keeper
  • KL Rahul
    KL RahulWicket Keeper
  • Jasprit Bumrah
    Jasprit BumrahBowler
  • Kuldeep Yadav
    Kuldeep YadavBowler
  • Mohammed Shami
    Mohammed ShamiBowler
  • Mohammed Siraj
    Mohammed SirajBowler
  • Prasidh Krishna
    Prasidh KrishnaBowler

వార్తలు

FAQs (తరచుగా అడిగే ప్రశ్నలు)

Q. వరల్డ్ కప్ 2023లో ఇండియన్ టీమ్ అనౌన్స్ చేశారా?

A. వరల్డ్ కప్ 2023 కోసం 15 మంది సభ్యులతో కూడిన ఇండియన్ టీమ్ ను అనౌన్స్ చేశారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్.

Q. వరల్డ్ కప్ 2023లో మొత్తం ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి?

A. వరల్డ్ కప్ 2023లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే అన్ని జట్లూ తమ టీమ్స్ ను అనౌన్స్ చేశాయి. ఆతిథ్య ఇండియాతోపాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ పాల్గొంటున్నాయి.

Q. వరల్డ్ కప్ 2023లో వెస్టిండీస్ ఆడుతోందా?

A. వరల్డ్ కప్ 2023 ప్రధాన టోర్నీకి వెస్టిండీస్ అర్హత సాధించలేదు. దీంతో ఆ జట్టు లేకుండా జరుగుతున్న తొలి వన్డే వరల్డ్ కప్ ఇదే.

Q. వరల్డ్ కప్ 2023 కోసం ఇండియా ఎంపిక చేసిన జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయా?

A. సెప్టెంబర్ 28 వరకు వరల్డ్ కప్ 2023 జట్లను ఎంపిక చేయడానికి ఐసీసీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత కూడా జట్టులో ఎవరైనా గాయపడితే మార్పులు చేసుకోవచ్చు. ఇండియన్ టీమ్ లో అక్షర్ పటేల్ గాయపడటంతో అతను సమయానికి కోలుకోకపోతే మరో ప్లేయర్ ను ఎంపిక చేసే అవకాశం ఇండియాకు ఉంటుంది.