Top CNG Cars: సీఎన్‍జీ కారు కొనాలనుకుంటున్నారా.. తక్కువ ధరలో టాప్ కార్లు ఇవే-top cng cars in india at affordable prices hyundai aura cng to maruti swift cng ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Top Cng Cars In India At Affordable Prices Hyundai Aura Cng To Maruti Swift Cng

Top CNG Cars: సీఎన్‍జీ కారు కొనాలనుకుంటున్నారా.. తక్కువ ధరలో టాప్ కార్లు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 19, 2023 04:39 PM IST

Top CNG affordable Cars: అందుబాటు ధరలో ఉండే సీఎన్‍జీ కారు కొనాలనుకుంటున్నారా.. అయితే కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఇవే. ఈ టాప్ కార్లపై ఓ లుక్కేయండి.

Top CNG Cars: సీఎన్‍జీ కారు కొనాలనుకుంటున్నారా
Top CNG Cars: సీఎన్‍జీ కారు కొనాలనుకుంటున్నారా

Top CNG affordable Cars: పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో సీఎన్‍జీ వాహనాలు (CNG Cars) దేశంలో బాగా పాపులర్ అవుతున్నాయి. చాలా మంది సీఎన్‍జీ (Compressed Natural Gas) కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంధనం (పెట్రోల్, డీజిల్)తో పాటు సీఎన్‍జీతో నడిచే ఆప్షన్ ఉండే కార్ల కోసం చూస్తున్నారు. చాలా పాపులర్ కార్ల మోడళ్లకు ప్రస్తుతం సీఎంజీ వెర్షన్‍లు లభిస్తున్నాయి. చాలా రేంజ్‍ల్లో లభిస్తున్నాయి. ఇలా బడ్జెట్ రేంజ్‍లో లభిస్తున్న టాప్ సీఎన్‍జీ కార్లు ఇవే.

హ్యుండాయ్ ఆరా సీఎన్‍జీ

Hyundai Aura CNG: ఎంతో పాపులర్ అయిన హ్యుండాయ్ ఆరాకు సీఎన్‍జీ వెర్షన్ అందుబాటులో ఉంది. సీఎన్‍జీ వెర్షన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఎస్ వేరియంట్ ధర రూ.8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఎస్ఎక్స్ ధర రూ.8.75లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. హ్యుందాయ్ ఆరా కారు.. 83 పీఎస్ గరిష్ఠ పవర్‌ను, 113 టార్క్యూను జనరేట్ చేస్తుంది. సీఎన్‍జీపై రన్ అవుతున్నప్పుడు 68 bhp గరిష్ఠ పవర్, 95 nm పీక్ టార్క్యూను ప్రొడ్యూజ్ చేయగలదు. 1.2-లీటర్ 4 సిలిండర్ బయో ఫ్లుయల్ (పెట్రోల్, సీఎన్‍జీ) ఇంజిన్‍ను హ్యుండాయ్ ఆరా సీఎన్‍జీ వెర్షన్ కలిగి ఉంది.

హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

Hyundai Grand i10 Nios CNG: హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియో సీఎన్‍జీ వెర్షన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. మ్యాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా వేరియంట్లలో వస్తోంది. 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ (పెట్రోల్, సీఎన్‍జీ) ఇంజిన్‍ను 10 నియోస్ సీఎన్‍జీ వెర్షన్ కలిగి ఉంది. ఈ కారు పెట్రోల్‍పై నడిచేటప్పుడు 83 పీఎస్ గరిష్ఠ పవర్, 113 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూజ్ చేస్తుంది. సీఎన్‍జీపై రన్ అయ్యేటప్పుడు 68 bhp గరిష్ఠ పవర్, 95 Nm పీక్ టార్క్యూను ఉత్పత్తి చేస్తుంది. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియో సీఎన్‍జీ వెర్షన్ ప్రారంభ ధర రూ.7.56 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

టాటా టియాగో ఐసీఎన్‍జీ

Tata Tiago iCNG: టాటా టియాగో ఐసీఎన్‍జీ ప్రారంభ ధర రూ.6.43లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 1.2 లీటర్ త్రీ సిలిండర్ రెవోట్రాన్ (పెట్రోల్, సీఎన్‍జీ) ఇంజిన్‍తో వస్తోంది. గరిష్ఠంగా 86 ps మ్యాక్స్ పవర్, 113 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేయగలదు.

మారుతీ స్విఫ్ట్ సీఎన్‍జీ

Maruti Swift SCNG: సీఎన్‍జీ హ్యాచ్‍బాక్ కార్ల సెగ్మెంట్‍లో కూడా మారుతీ స్విఫ్ట్ మంచి మార్కెట్‍ను సొంతం చేసుకుంటోంది. స్విఫ్ట్ సీఎన్‍జీ ప్రారంభ ధర రూ.7.8లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ (పెట్రోల్, సీఎన్‍జీ) డ్యుయల్ జెట్ ఇంజిన్‍ను ఈ కారు కలిగి ఉంటుంది. 89 ps మ్యాక్స్ పవర్, 113 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేయగలదు.

WhatsApp channel

సంబంధిత కథనం