Companies with more female employees: మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీలివే-tcs has more female employees than any company in india says survey ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Companies With More Female Employees: మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీలివే

Companies with more female employees: మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీలివే

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 10:03 PM IST

Companies with more female employees: విధి నిర్వహణ సామర్ధ్యంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు లేకపోయినా.. మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. అయితే, కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు మంచి అవకాశాలిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Companies with more female employees: ప్రైవేటు కంపెనీల్లో, ముఖ్యంగా టెక్ దిగ్గజ కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయ స్థాయిలో ఉంటోంది. రిక్రూట్ మెంట్ లోనూ వారు అబ్బాయిలతో సమానంగా అవకాశాలు పొందుతున్నారు. వేతనాల్లోనూ పెద్దగా తేడా ఉండడం లేదు. అయితే, మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న సంస్థలకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్ కు చెందిన బురుంగ్డీ ప్రైవేట్, హురున్ ఇండియాలు ఒక సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో తేలిన విశేషాలు ఇవే..

TCS tops in female employees number: టాప్ లో టీసీఎస్

మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీల్లో టీసీఎస్(Tata Consultancy Services -TCS) మొదటి స్థానంలో ఉంది. భారత్ లోని ఏ ఇతర సంస్థలో కన్నా ఇందులో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉన్న ఈ కంపెనీలో సుమారు 2,10,000 మంది మహిళా ఉద్యోగులున్నారు. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 35%. టీసీఎస్ లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,92,195.

Top five companies: తరువాతి స్థానాల్లో..

మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీల్లో టీసీఎస్ తరువాత స్థానాల్లో ఇన్ఫోసిస్(Infosys), విప్రో(Wipro), హెచ్ సీఎల్ టెక్నాలజీస్(HCL Technologies), రిలయన్స్ ఇండ్రస్ట్రీస్(Reliance Industries) ఉన్నాయి. అంటే, ఇవి మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న టాప్ ఫైవ్ కంపెనీలు అన్నమాట. ఈ టాప్ ఫైవ్ కంపెనీల్లో మొత్తంగా 5.5 లక్షలకు పైగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిలో Infosysలో 1.25 లక్షల మంది, Wiproలో 88,946 మంది, HCL Technologiesలో 62,780 మంది Reliance Industries 62,560 మంది మహిళలు విధుల్లో ఉన్నారు.

Companies with more female employees: ఇవి కాకుండా..

ఇవి కాకుండా మహిళలకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఇచ్చిన సంస్థలు మరికొన్ని ఉన్నాయి. అవి మదర్సన్ సుమి సిస్టమ్స్(Motherson Sumi Systems), టెక్ మహింద్ర(Tech Mahindra), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank), హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్(HDFC Bank), పేజ్ ఇండస్ట్రీస్(Page Industries). వీటిలో మదర్సన్ సుమి సిస్టమ్స్ లో 52,501మంది, టెక్ మహింద్ర లో 42,774, ఐసీఐసీఐ బ్యాంక్ లో 32,697, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ లో 22,750, పేజ్ ఇండస్ట్రీస్ లో 22,631 మంది మహిళా ఉద్యోగులున్నారు.

Whats_app_banner