Sensex crosses 73,000: ఐటీ దిగ్గజాల సపోర్ట్ తో తొలిసారి 73 వేల రికార్డ్ మార్క్ ను టచ్ చేసిన సెన్సెక్స్-sensex crosses 73 000 points how it giants are driving up markets today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sensex Crosses 73,000: ఐటీ దిగ్గజాల సపోర్ట్ తో తొలిసారి 73 వేల రికార్డ్ మార్క్ ను టచ్ చేసిన సెన్సెక్స్

Sensex crosses 73,000: ఐటీ దిగ్గజాల సపోర్ట్ తో తొలిసారి 73 వేల రికార్డ్ మార్క్ ను టచ్ చేసిన సెన్సెక్స్

HT Telugu Desk HT Telugu
Jan 15, 2024 12:34 PM IST

Sensex crosses 73,000: గత రెండు వారాలుగా ఐటీ స్టాక్స్ లో ర్యాలీ కొనసాగుతోంది. ముఖ్యంగా, మూడో త్రైమాసికం ఫలితాల నేపథ్యంలో ఐటీ దిగ్గజాల సపోర్ట్ తో సెన్సెక్స్ సోమవారం 73 వేల మార్క్ ను దాటేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

Sensex crosses 73,000: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని కంపెనీలు తమ Q3 ఫలితాల ప్రకటనల మధ్య ర్యాలీని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ మరో రికార్డును నమోదు చేసింది, సోమవారం BSE సెన్సెక్స్ 73,000, NSE నిఫ్టీ 22,000 పాయింట్లను దాటింది.

సెన్సెక్స్, నిఫ్టీల రికార్డులు

జనవరి 15 ఉదయం సెషన్ లో సెన్సెక్స్ 73,108.31 వద్ద కొత్త రికార్డును తాకగా, నిఫ్టీ గత వారం క్రితం మార్కెట్ సెషన్‌లో 21,189 వద్ద ముగిసిన తర్వాత సోమవారం 22,053.15 వద్ద ఆల్ టైమ్ హై వద్ద ప్రారంభమైంది. సోమవారం ప్రారంభ ట్రేడ్ గంటలలో సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలో భారీ బూమ్ కనిపించింది. మిగతా సెక్టార్స్ కన్నా IT కంపెనీలు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. ఈ రోజు సెన్సెక్స్ బూమ్‌కు ఎక్కువగా సహకరిస్తోంది ఐటీ దిగ్గజం విప్రో. ఆ కంపెనీ షేర్లు 14 శాతానికి పైగా ర్యాలీ చేస్తున్నాయి.

విప్రో దూకుడు

ఐటీ సంస్థ విప్రో డిసెంబరు త్రైమాసిక ఆదాయాలు అంచనాలను మించిపోయిన తర్వాత సోమవారం విప్రో షేర్లు దాదాపు 14 శాతం పెరిగాయి. దాంతో, దాని మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.18,168.68 కోట్లు పెరిగింది. జనవరి 15న ప్రారంభ ట్రేడ్ అవర్స్‌లో విప్రో టాప్ గెయినర్‌గా నిలిచింది. టెక్ మహీంద్రా, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ మరియు ఎస్బీఐ వంటి సంస్థలు కొంచెం వెనుకబడి ఉన్నాయి. విప్రో తో పాటు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ వంటి స్టాక్‌లు సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడానికి బాగా దోహదపడ్డాయి.

గత రెండు వారాలుగా..

గత కొన్ని వారాలుగా ఐటి స్టాక్‌లు పుంజుకోవడం వల్లనే భారత స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వికె విజయకుమార్‌ విశ్లేషించారు. 2023 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో సేవలు మరియు సాఫ్ట్‌వేర్ వ్యాపారాల్లో వృద్ధి నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం 6.2 శాతం వృద్ధితో ఏకీకృత నికర లాభాలు రూ. 4,350 కోట్లకు చేరుకున్నాయి. త్వరలో మరికొన్ని దిగ్గజ సంస్థలు తమ క్యూ 3 ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఈ మార్కెట్ ర్యాలీ మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.