Lay off news: అమెరికాలో లే ఆఫ్స్ తో L-1 వీసాదారులకు మరిన్ని కష్టాలు
Lay off news: మేజర్ టెక్ కంపెనీలే కాదు, చిన్న స్థాయి కంపెనీలు కూడా ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. దాంతో, అమెరికాలో ఉద్యోగం కోల్పోతున్న విదేశీయుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
ప్రతీకాత్మక చిత్రం (HT)
Lay off news:చిన్న, పెద్ద కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే గత సంవత్సరం నవంబర్ నుంచి సుమారు 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులు (IT workers) జాబ్స్ కోల్పోయారు. వారిలో అత్యధికులు L-1, H1B వీసా దారులే. ఇలా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సుమారు 40% భారతీయులే.
Lay off news: L-1 కే కష్టాలు ఎక్కువ
అయితే, ఇలా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నవారిలో H1B visa ఉన్నవారి కన్నా L-1 వీసాదారులకే ( ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. L-1 వీసాదారు ఉద్యోగం కోల్పోతే, తన జీవిత భాగస్వామి కూడా L-2 వీసా పై ఉద్యోగం చేసే అర్హత కోల్పోతారు. అంటే, ఒకేసారి ఇద్దరు ఉద్యోగాలు కోల్పోతారు. దాంతో, వారి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులవుతుంది. దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
Lay off news: ఈ పరిస్థితుల్లో వారు ఏం చేయవచ్చు?
- L-1 వీసాపై ఉద్యోగం చేసున్న వ్యక్తి జాబ్ కోల్పోతే, దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే వెంటనే అతడు I-539 ఫైల్ చేసి B2 విజిటర్ వీసా పొందాలి. తద్వారా వారికి కొంత సమయం లభిస్తుంది.
- సాధ్యమైనంత త్వరగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం చేయాలి. లేదా తెలిసిన ఎంప్లాయర్ ద్వారా హెచ్ 1 బీ క్యాప్ లాటరీలో అవకాశం పొందేందుకు ప్రయత్నించాలి.
- B2 వీసా కు వెళ్లి, వెంటనే ఏదైనా విద్యాసంస్థ ద్వారా I-20 పొంది స్టుడెంట్ వీసా పొందే ప్రయత్నం చేయవచ్చు.
- H-1B వీసాతో ఉన్న ఉద్యోగి జాబ్ కోల్పోయినప్పుడు, H-4 EAD తో జాబ్ చేస్తున్న జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేసే అర్హత కోల్పోతారు. కానీ వారుకి రెండు నెలల గడవు లభిస్తుంది.
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.