Banks Strike on 19 : నవంబర్ 19న దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మెత-banking services across the nation will get affected on november 19 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Banking Services Across The Nation Will Get Affected On November 19

Banks Strike on 19 : నవంబర్ 19న దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మెత

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 02:21 PM IST

Banks Strike on 19 దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలపై దాడులు పెరగడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 19న దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నారు.

నవంబర్ 19న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
నవంబర్ 19న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

Banks Strike on 19 సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగులు నవంబర్ 19న దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఉద్యోగులపై వేధింపులు, వేతన సవరణ ఒప్పందాలు అమలు చేయకపోవడం, బ్యాంకు లావాదేవీల్లో లోపాలకు ఉద్యోగాలను బాధ్యులుగా చేయడం, కార్మిక సంఘాలపై ప్రభుత్వాల వేధింపులు, పని భారం పెరగడం వంటి కారణాలతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) సభ్యులు సమ్మెకు పిలుపునిచ్చినందున వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి.

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) జనరల్ సెక్రటరీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు సమ్మె నోటీసును అందచేసారు. డిమాండ్ల పరిష్కారం కోసం నవంబర్ 19వ తేదీన సమ్మెకు వెళ్లాలని ప్రతిపాదించారు.

సమ్మె రోజుల్లో బ్యాంక్ శాఖలు మరియు కార్యాలయాలు సజావుగా పనిచేయడానికి బ్యాంక్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సమ్మె కార్యరూపం దాల్చినట్లయితే, శాఖలు మరియు కార్యాలయాల పనితీరు ప్రభావితం కావచ్చని బ్యాంకుల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

నవంబర్ 19 మూడవ శనివారం కావడంతో ఆ రోజు సాధారణ లావాదేవీలు కొనసాగాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొదటి మరియు మూడవ శనివారాలు తెరిచి ఉంటాయి. రెండు నాలుగు, శనివారాల్లో శెలవులుగా ప్రకటించారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం ఏది రాకపోతే సమ్మె అనివార్యమని చెబుతున్నారు. అక్టోబర్ 31 నుంచి బ్యాంకు ఉద్యోగ సంఘాలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నాయి. అక్టోబర్ 18న అన్ని బ్యాంకు కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 19వ తేదీన దేశవ్యాప్తంగా ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ సారి సమ్మెలో పాల్గొనే అవకాశాలున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల్లో వేధింపులు పెరుగుతుండటంతో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌తో కలిసి పలు డిమాండ్లతో సమ్మె బాట పట్టనున్నారు.

WhatsApp channel