Justice Battu Devanand : రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి ఉందా?-justice battu devanand comments on capital issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Justice Battu Devanand Comments On Capital Issue

Justice Battu Devanand : రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి ఉందా?

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 06:43 PM IST

Andhra Pradesh Capital Issue : రాష్ట్ర రాజధానిపై హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇదీ అని చెప్పుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు.

జస్టిస్ బట్టు దేవానంద్(ఫైల్ ఫొటో)
జస్టిస్ బట్టు దేవానంద్(ఫైల్ ఫొటో)

రాజధాని అంశంపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితులపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కీలక కామెంట్స్ చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో తెలుగు వారికి ఇదీ రాష్ట్ర రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? అని అడిగారు. బయట వారి వద్ద అవమానాలు ఎదుర్కొనే పరిస్థితికి తెలుగు జాతి చేరిందని వ్యాఖ్యానించారు.

'గొప్పగా చెప్పుకోవచ్చుగానీ ఏం సాధించాం? రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? దిల్లీలో చదువుతున్న మా అమ్మాయిని మీ రాజధాని ఏది? అని ఆటపట్టిస్తున్నారు. మన పిల్లలు కూడా తలవంచుకునే స్థితిలో ప్రస్తుతం తెలుగుజాతి ఉంది. ప్రతి దానికీ కులం, రాజకీయం, స్వార్థం ఇలా ఉన్నాయి. అవలక్షణాలను మార్చాల్సిన బాధ్యత రచయితలదే.'అని జస్టిస్‌ దేవానంద్‌ అన్నారు.

కొంతమంది ముందు చూపు లేని కారణంగా.. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని జస్టిస్ బట్టు దేవానంద్ అభిప్రాయపడ్డారు. అమృత భారతి పేరిట ప్రపంచ రచయితల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో తెలుగువారి ప్రగతి వ్యాసాల సంకలనంతో పుస్తకాన్ని ముద్రించారు.

సుప్రీం కోర్టుకు వివాదం

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. వికేంద్రీకరణతోనే అభివృద్ధి అని వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి సుమారు 35 వేల ఎకరాల భూసేకరణ చేసిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానులపై ప్రకటన చేసింది. వికేంద్రీకరణ చట్టం తెచ్చింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు చెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభకు లేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో సవాలు చేసింది. చట్టాలు చేయడంలో శాసనసభ అధికారాలను కోర్టులు నిర్ణయించలేవని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించింది.

అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ హైకోర్టులో సవాలు చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న ఏపీ సర్కార్ అభిప్రాయపడింది. రాజధాని వికేంద్రీకరణపై గతంలో హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టాలు చేయడానికి శాసనసభకు ఉన్న అధికారాలను హైకోర్టు ప్రశ్నించలేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు శాసనాలు చేయకుండా న్యాయస్థానాలు నిరోధించలేవని ప్రభుత్వం వాదిస్తోంది.

IPL_Entry_Point