AP Family Doctor Concept : అక్టోబర్ 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్-family doctor concept starts from october 21 in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Family Doctor Concept Starts From October 21 In Andhra Pradesh

AP Family Doctor Concept : అక్టోబర్ 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 01:04 PM IST

Andhra Pradesh Family Doctor Concept : ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో క్లినిక్ పరిధిలో 2 వేల మందికి సేవలు అందిస్తారు.

సీఎం జగన్ (ఫైల్ ఫొటో)
సీఎం జగన్ (ఫైల్ ఫొటో) (twitter)

గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. విలేజ్ క్లినిక్స్ లో 24 గంటలపాటు వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మెుత్తం ఏపీలో 100032 వైఎస్సార్‌ విలేజ్ హెల్త్ క్లినిక్‌(YSR Health Clinic)ల ఏర్పాటుతో క్లినిక్ పరిధిలో 2 వేల మందికి వైద్య సేవలు అందిస్తారు.

ద్వారా 14 రకాల డయాగ్నోస్టిక్ ర్యాపిడ్ కిట్స్(Rapid Kits), 67 రకాల మందులు అందుబాటులో పెట్టనున్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా వైద్యధికారి, మిగిలిన టీమ్ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలకు నెలలో రెండు సార్లు వెళ్తారు. వైద్యంతోపాటుగా ఆరోగ్య శ్రీ(Arogya Sri) సేవలపై చెబుతారు. 6,313 సబ్ సెంటర్స్, 3,719 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేశారు. ప్రతి 5 వేలమంది జనాభాకు హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.

ఏపీ వ్యాప్తంగా నూతన భవనాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్(Village Health Clinic) ఏర్పాటు చేస్తారు. ఒక్క ఏఎన్ఎం, ఒక ఎమ్ ఎల్ హెచ్ పీ, ఆశా వర్కర్లు పనిచేస్తారు. విలేజ్ క్లినిక్ లలో అన్ని రకాల వేద్య సేవలు ఉంటాయి. ఒకవేళ గ్రామస్థాయిలో నయం కాకుండే.. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ద్వారా ఆసుపత్రులకు పంపిస్తారు. చిన్న పిల్లలు, గర్భిణిలకు కూడా వైద్య సేవలు ఉంటాయి. టెలీ మెడిసిన్(Tele Medicine), టెలీ హబ్‌ల ద్వారా మెడికల్ ఆఫీసర్‌ సహా ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెస్తారు. అనంతరం.. వైద్య సేవలను నేరుగా ఇంటికే అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రతి పౌరుడి ఇంటి వద్దకు వెళ్లి.. పరీక్షలు చేస్తారు. వారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తారు. ప్రతి పౌరుడి వివరాలు , వారి అనుమతి తీసుకోని, డిజిటలైజ్ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు డిజిటల్ HEALTH ID క్రియేట్ చేస్తారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను దేశంలోనే ఇదే తొలిసారి. ఆరోగ్యశ్రీ, ఎన్‌సిడి స్క్రీనింగ్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్‌ను ఏకీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. అవసరం అనుకంటే.. ఎన్ సీడీ కేసులకు ఫ్యామిలీ డాక్టర్ రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి మండలానికి నలుగురు వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు ప్రాథమికంగా ప్రజలకు వైద్య సేవల్ని మరింత బలోపేతం చేయాలని.. మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని సీఎం జగన్(CM Jagan) ప్రారంభిస్తారు. వచ్చే జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.

IPL_Entry_Point