CM Jagan Review : బొగ్గు నిల్వల కొరత లేకుండా చూడాలి-cm jagan review on energy department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Review : బొగ్గు నిల్వల కొరత లేకుండా చూడాలి

CM Jagan Review : బొగ్గు నిల్వల కొరత లేకుండా చూడాలి

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 07:25 PM IST

CM Jagan On Shortage Of Coal Reserves : రాష్ట్రంలో బొగ్గు నిల్వల కొరత లేకుండా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పంపుసెట్లకు మీటర్లపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలన్నారు.

సీఎం జగన్
సీఎం జగన్ (twitter)

సీఎం జగన్(CM Jagan) ఇంధన శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో బొగ్గు నిల్వల(Coal Reserves ) కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పెరుగుతున్న విదేశీ బొగ్గు ధరలను దృష్టిలో ఉంచుకుని దేశీయంగా సరఫరా చేసేందుకు కృషి చేయాలని, తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వచ్చే వేసవిలో విద్యుత్(Electricity) అంతరాయాలు లేకుండా ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బొగ్గు(Coal) ద్వారా ద్వారా పూర్తి ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం జగన్‌ సూచించారు. కాగా, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు ఇప్పటి వరకు 16,63,705 మంది రైతులు అంగీకరించారని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ చాలా పారదర్శకంగా, నాణ్యతతో ఉండాలన్నారు. మీటర్లపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మీటర్ల వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు ఎప్పటికప్పుడు వివరాలు అందించాలన్నారు. తద్వారా సరిపడా కరెంటు పంపిణీ చేయడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నారు. రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా విద్యుత్ పంపిణీ(Power Distribution) సంస్థలు మీటర్లు బిగిస్తాయన్నారు. వినియోగిస్తున్న విద్యుత్తు ఖర్చు కూడా నేరుగా రైతుల ఖాతాలకు చేరుతుందన్నారు.

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు(Pilot Project) వల్ల రైతులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ అన్నారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌కే విజయానంద్‌, ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌, ఏపీ జెన్‌కో ఎండీ బీ శ్రీధర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

IPL_Entry_Point