తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala Brahmotsavam 2022 In Pics : శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
- తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
- తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
(1 / 13)
తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి దర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి.
(2 / 13)
అంతుముందు తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
(3 / 13)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
(4 / 13)
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
(5 / 13)
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
(6 / 13)
తొలిరోజైన మంగళవారం ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్.
(7 / 13)
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు సీఎం. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
(8 / 13)
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు సీఎం. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
(9 / 13)
ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ఇతర గ్యాలరీలు