Bulk Drug Park In AP : ఏపీలో బల్క్ డ్రగ్ పార్కుకు కేంద్రం ఆమోదం.. ఎక్కడో తెలుసా?-ap gets bulk drug park centre give rs 1000 crore aid ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bulk Drug Park In Ap : ఏపీలో బల్క్ డ్రగ్ పార్కుకు కేంద్రం ఆమోదం.. ఎక్కడో తెలుసా?

Bulk Drug Park In AP : ఏపీలో బల్క్ డ్రగ్ పార్కుకు కేంద్రం ఆమోదం.. ఎక్కడో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Aug 30, 2022 10:47 PM IST

Bulk Drug Park In Andhra Pradesh : ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి.

ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్
ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్రం ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని కేపీ పురంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఆమోదానికి సంబధించి.. ఏపీకి కేంద్రం లేఖ రాసింది. అయితే ఈ లేఖ అందిన వారంలోపు .. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయాలి. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువులు ఔషధ మంత్రిత్వశాఖ తెలిపింది.

బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై 2020 ఆగస్టులోనే ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో 2వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణం గురించి.. ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ ప్రైవేటు ఆపరేటర్లు మొత్తంగా రూ.6,940 కోట్లు పెట్టుబడులు వస్తాయని కూడా అంచనా వేసింది. దీని కోసం ఓ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రైవేటు భాగస్వామి ద్వారా బల్క్ డ్రగ్ పార్కును అభివృద్ధి చేయాలని అనుకుంది.

ఈ ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా కేంద్రం నుంచి రూ.1000 కోట్లు ఆర్థిక సాయం అందిస్తుంది. వారం లోపు అనుమతి తెలుపుతూ లేఖ రాసిన తర్వాత.. 90 రోజుల్లోగా ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలి. కేంద్రం చెప్పే సూచనలు పాటిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రొత్సాహకాలను ఈ ప్రాజెక్టు కింద అందించాలని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్కుల కోసం 13 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. 3 రాష్ట్రాలు మాత్రమే బల్క్ డ్రగ్ పార్కు పారిశ్రామిక వాడలను దక్కించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్కు కోసం పోటీలో ఉన్నాయి. ఏపీ మాత్రం దక్కించుకుంది.

IPL_Entry_Point