AP BJP Candidates List : బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్, ఇవాళే అభ్యర్థుల జాబితా విడుదల!-amaravati ap bjp candidates list released ysrcp mla varaprasad join lotus party got ticket ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Amaravati Ap Bjp Candidates List Released Ysrcp Mla Varaprasad Join Lotus Party Got Ticket

AP BJP Candidates List : బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్, ఇవాళే అభ్యర్థుల జాబితా విడుదల!

Bandaru Satyaprasad HT Telugu
Mar 24, 2024 02:13 PM IST

AP BJP Candidates List : ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. మొత్తం 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. ఇవాళ సాయంత్రం అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్
బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్

AP BJP Candidates List : ఏపీలో వైసీపీకి(Ysrcp) మరో షాక్ తగిలింది. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్(Mla Varaprasad Joins BJP) ఆదివారం బీజేపీలో చేరారు. దిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ కు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో ఎమ్మె్ల్సీ మేరిక మురళీధర్ కు టికెట్ ఇచ్చింది. దీంతో అసంతృప్తితో ఉన్న ఇవాళ బీజేపీలో చేరారు. ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్(Tirupati MP Ticket) కేటాయిస్తారని సమాచారం. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఏపీలో బీజేపీ స్థానాలు ఖరారు

ఎమ్మెల్యే వరప్రసాద్ (Mla Varaprasad)పాటు టీడీపీ నేత రోషన్(TDP Roshan) బీజేపీలో చేరారు. రోషన్ కు బద్వేల్ ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని సమాచారం. టీడీపీ, జనసేనతో పొత్తు భాగంగా బీజేపీకి(AP BJP List) 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇవాళ సాయంత్రం బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థుల జాబితాను(AP BJP Candidates List) ప్రకటించనుంది. బీజేపీ అరకు లోయ, ఎచ్చెర్ల. విశాఖ ఉత్తరం, జమ్మలమడుగు, ఆదోని, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేల్, ధర్మవరం, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. అలాగే అరకు, అనకాపల్లి, నర్సాపురం, రాజంపేట, రాజమండ్రి, తిరుపతి, లోక్ సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.

సెలబ్రెటీలకు టికెట్లు

వచ్చే ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ (BJPss)వ్యూహాలు రచిస్తోంది. ప్రముఖులకు సీట్లు కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాలుగో జాబితా విడుదల(BJP List) చేసింది. ఈ జాబితాలో నటి రాధికా శరత్ కుమార్‌కు టికెట్ కేటాయించింది. తమిళనాడులోని విరుధ్ నగర్ నుంచి రాధికా శరత్ కుమార్(Radhika Sarathkumar) లోక్‌సభ కు పోటీ చేయనున్నారు. మొత్తం 15 మందితో బీజేపీ నాలుగో జాబితా విడుదల చేసింది. తమిళనాడులో 14 సీట్లు, పుదుచ్చేరిలో ఒక టికెట్ ప్రకటించింది.

లోక్ సభ బరిలో కంగనా

ప్రముఖ నటి కంగనా రనౌత్​ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి(PM Modi) హార్డ్ కోర్​ ఫ్యాన్​గా పేరొందిన కంగనా రనౌత్(Kangana Ranaut)​ను ఈసారి ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ భావిస్తోందట. పలు మీడియా నివేదికల ప్రకారం బీజేపీ తరఫున కంగనా రనౌత్​ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. హిమాచల్​ప్రదేశ్ మండీ లోక్​సభ సీటు నుంచి ఆమెను బరిలో దింపాలని బీజేపీ భావిస్తోంది. గతేడాది.. తన రాజకీయ అరంగేట్రం, ఎన్నికల్లో పోటీ విషయంపై కంగనా రనౌత్​స్పందించారు. "శ్రీ కృష్ణుడి ఆశీస్సులు ఉంటే.. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను," అని ఆమె అన్నారు. మోదీపై తనకి ఉన్న అభిమానాన్ని అనేకమార్లు బహిరంగంగానే చెప్పారు కంగనా.

IPL_Entry_Point

సంబంధిత కథనం