sdma News, sdma News in telugu, sdma న్యూస్ ఇన్ తెలుగు, sdma తెలుగు న్యూస్ – HT Telugu

Latest sdma Photos

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం  తీవ్ర అల్పపీడనంగా మారి తీరం వైపు కదులుతోంది. కోస్తా తీరం వైపు  రాబోయే 24 గంటల్లో ఉత్తరదిశగా కదు లుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Rains Update: ఉత్తరకోస్తా వైపు కదులుతున్న అల్పపీడనం, నేడు రేపు భారీ వర్షాలు, రైతులకు అలర్ట్‌..

Friday, December 20, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ఈ  క్రమంలో శుక్రవారానికి ఉత్తర కోస్తా వైపు పయనిస్తోంది. ఇది తీరం దాటుతుందా? లేక సముద్రంలో ఇంకా బలపడు తుందా? లేదా భూ ఉపరితలం మీదుగా బలహీనపడుతుందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కోస్తాలో వర్గాలు మొదలయ్యాయి. గురువారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలుకురుస్తాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేశారు.

AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తాలో ముసురు, పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

Thursday, December 19, 2024

ఆంధ్రప్రదేశ్‌కు వానగండం వీడటం లేదు. పంటలు చేతికి అందే సమయంలో కురుస్తున్న వర్షాలతో  ఏపీలోని కోస్తా, రాయలసీమల్లోనూ వేలాది ఎక రాల్లో పంట నష్టం వాటిల్లింది. దాని నుంచి ఇంకా కోలుకోక ముందే రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి ఇది స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా రానుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రికి వాయుగుండంగా బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు.

AP Rain Updates: బంగాళా‌ాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, ఏపీకి వాన గండం, కోస్తా జిల్లాల్లో రైతులకు అలర్ట్…

Monday, December 9, 2024

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వ తేది వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Rains Alert: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఈసారి కోస్తా జిల్లాల్లో వర్షాలు, రైతులకు హై అలర్ట్‌

Monday, December 9, 2024

బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫెంగల్‌ తుఫాను ప్రభావం నుంచి నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు కోలుకోక ముందే  బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

BayOfBengal Depression: శుక్రవారానికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి మళ్లీ వానగండం

Wednesday, December 4, 2024

తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు కుంతలాం 11డిగ్రీలు,  అల్లూరి సీతారామరాజు జి.మాడుగులలో 11 అల్లూరి సీతారామరాజు డుంబ్రిగుడ 12.3 డిగ్రీలు అల్లూరి సీతారామరాజు చింతపల్లి 12.7 డిగ్రీలు, తిరుపతి పల్లాం 13.1 పార్వతీపురం మన్యం లేవిడి 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి.

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. అల్లూరి, ఆదిలాబాద్‌లో 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు

Wednesday, November 27, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ  గంటకు 30కిమీ వేగంతో కదులుతోంది, ఇది ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 530 కిమీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 810 కిమీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 920 కిమీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 1000 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని, ఆతర్వాత వచ్చే 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

AP Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు అలర్ట్, రైతులకు వానగండం

Tuesday, November 26, 2024

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్ష సూచన ఉంది.  బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. పంటలు కోతలకు వచ్చే సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా హెచ్చరించారు.

AP Rains Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రానికి భారీ వర్ష సూచన, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Thursday, November 21, 2024

బంగాళాఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తోంది.  ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఉంటుంది. బంగాళాఖాతంల వల్ల వీస్తున్న తూర్పు గాలుల పరభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి.

AP Weather Update: బంగాళాఖాతంలో 23న మరో అల్పపీడనం, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్ష సూచన

Monday, November 18, 2024

అల్పపీడనంతో  వర్షాలు కురవనున్న  నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరారు. వర్షాలకు  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేసారు.

AP Rains Update: ముంచుకొస్తున్న అల్పపీడనం, పంటనష్టంపై ఆందోళన, కోస్తా, సీమ జిల్లాలకు అలర్ట్‌

Tuesday, November 12, 2024

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

AP Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు, పంటల్ని కాపాడుకోవాలని రైతులకు అలర్ట్‌

Monday, November 11, 2024

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

AP Cyclone Alert: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం..రెండ్రోజుల్లో తుఫానుగా రూపాంతరం.. ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..

Monday, October 21, 2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో సారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరి తల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.

AP Cyclone Alert: ఏపీ మళ్లీ తుఫాను ముప్పు, ఈసారి రాయలసీమ వంతు, ఐఎండి అంచనాలు…

Friday, October 11, 2024

వాతావరణ శాఖ అంచనాల  ప్రకారం గురువారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవొచ్చు.

AP Rains Update: నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు..విజయవాడలో పిడుగుల వానతో జనం బెంబేలు

Thursday, October 3, 2024

ఏపీ ప్రజల్ని మరోసారి అల్పపీడనం హెచ్చరికలు భయపెడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండి వర్షసూచనలు జారీ చేసింది.  ఈ నెల ప్రారంభంలో వచ్చిన భారీ వర్షాలు ఏపీలోని విజయవాడతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలను అతలాకుతలం చేసింది.

AP TG Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం… తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్షసూచన

Monday, September 23, 2024