BRS Party : కొందరు సిట్టింగ్‌లకు ఫిట్టింగ్ తప్పదా? KCR హెచ్చరికలు దేనికి సంకేతం..?-what is the strategy behind kcr warning to brs sitting mlas over tickets issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  What Is The Strategy Behind Kcr Warning To Brs Sitting Mlas Over Tickets Issue

BRS Party : కొందరు సిట్టింగ్‌లకు ఫిట్టింగ్ తప్పదా? KCR హెచ్చరికలు దేనికి సంకేతం..?

HT Telugu Desk HT Telugu
Apr 28, 2023 03:34 PM IST

Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. సూటిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూనే… టికెట్ల అంశానికి ముడిపెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై కేసీఆర్ ఓ క్లారిటీతోనే ఉన్నారన్న చర్చ జోరందుకుంది.

గులాబీ బాస్ కేసీఆర్
గులాబీ బాస్ కేసీఆర్

KCR On MLA Tickets: కేసీఆర్..... వ్యూహాలు రచించటంలో దిట్ట..! ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ... ప్రత్యర్థి పార్టీలను ఈజీగా బోల్తా కొట్టించేస్తారు..! సూటిగానే పదునైన మాటలతో... టార్గెట్ చేసి ఏకిపారేస్తారు.. ! కాస్త సైలెన్స్ గా ఉన్నారంటే... ఏదో మాస్టర్ స్కెచ్ తో ముందుకువస్తారన్నట్లు ఉంటుంది ఆయన తీరు..! ఆయన తీసుకొనే కొన్ని నిర్ణయాలు కూడా ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి..! తాజాగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలో క్లియర్ కట్ హెచ్చరికలు జారీ చేశారు. జాగ్రత్తగా పని చేసుకోవాలని… లేకపోతే మీకే నష్టమంటూ ఓ హింట్ ఇచ్చారు. అంతేనా… దళితబంధు, నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు, పలువురి నేతల తీరుపై కూడా కన్నెర్ర చేశారు. అయితే టికెట్ల విషయంలో కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు… ఓ వ్యూహం ప్రకారమే చేశారన్న చర్చ నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు కేసీఆర్. క్యాడర్ లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలని,,,. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని... మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమంటూ సూటిగానే చెప్పేశారు. అయితే నిజానికి 25 నుంచి 30 సిట్టింగ్ సీట్లలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే వారికి వారుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావటంతో ఆయా స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో కూడా పలు కీలకమైన స్థానాలు ఉన్నాయి. ఇక వీటికి తోడు కేసీఆర్ చేయిస్తున్న సర్వే రిపోర్టుల్లో పలువురు ఎమ్మెల్యేలు వెనకబడినట్లు నివేదికలు ఉన్నాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. వీటన్నింటి నేపథ్యంలో... పలువురి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కడం కష్టమనే చర్చ నడుస్తోంది.

అయితే ఎమ్మెల్యేలను జాగ్రత్తగా పని చేసుకోవాలని, అలా చేయకపోతే టికెట్ కష్టమనే విధంగా కేసీఆర్ చెప్పటంతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు సీరియస్ గా గ్రౌండ్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే మాదిరిగా టికెట్ పై తమకే అన్న ధీమాతో ఉండే ఇతర నేతలు కూడా పార్టీ కోసం మరింత గట్టిగా పని చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పట్నుంచే క్లారిటీ ఇస్తే.... కీలక నేతలు పార్టీలు మారే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా... ఎన్నికల నాటికే టికెట్ల అంశాన్ని తేల్చే విధంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. తద్వారా... ఎన్నికల టాస్క్ ను సక్సెస్ పుల్ గా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కేసీఆర్ హెచ్చరికలు... కొందరు ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాయనే వాదన కూడా ఓవైపు నుంచి వినిపిస్తోంది...! అయితే వీటికి భిన్నంగా కూడా కేసీఆర్(2018 అసెంబ్లీ ఎన్నికల మాదిరి) ముందుకెళ్లే అవకాశం లేకపోలేదు…!

IPL_Entry_Point

సంబంధిత కథనం