Prakash Raj | జాతీయస్థాయిలో కేసీఆర్ టీమ్ రెడీ అవుతుందా? ప్రకాశ్​రాజ్​కు రాజ్యసభ్య సీటు ఖాయమేనా ?-telangana cm kcr may offer rajya sabha seat to prakash raj ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Cm Kcr May Offer Rajya Sabha Seat To Prakash Raj

Prakash Raj | జాతీయస్థాయిలో కేసీఆర్ టీమ్ రెడీ అవుతుందా? ప్రకాశ్​రాజ్​కు రాజ్యసభ్య సీటు ఖాయమేనా ?

HT Telugu Desk HT Telugu
Feb 22, 2022 12:46 PM IST

ఇటీవల.. ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అయితే సమావేశంలో ప్రకాశ్ రాజ్ పైకి అందరి దృష్టి వెళ్లింది. ఈ సమావేశానికి.. ఆయన ఎందుకొచ్చారు? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తో పాటు.. ప్రకాశ్ రాజ్ కీలకపాత్ర పోషించనున్నారా? టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేవారిలో ఉన్నారా?

ప్రకాశ్ రాజ్(ఫైల్ ఫొటో)
ప్రకాశ్ రాజ్(ఫైల్ ఫొటో) (twitter)

కేంద్రంపై కేసీఆర్.. విమర్శలు గుప్పించినప్పటి నుంచి.. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ హాట్ టాపిక్ అయింది. మరోవైపు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. తన మార్క్ పాలిటిక్స్ చేసేందుకు రెడీ అయిపోయినట్టు కనిపిస్తుంది. అయితే నేషనల్ స్థాయిలో కేసీఆర్ తో .. నడిచేందుకు ఒక స్ట్రాంగ్ టీం కావాలి. అందులో భాగంగానే.. కొత్త టీమ్ ని కేసీఆర్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు అర్థమవుతోంది.  ప్రకాశ్ రాజ్ కూడా కేసీఆర్ వెంట నడవనున్నట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. కానీ.. ఎంతో కొంత వాటి వైఫల్యం కనిపించింది. అయితే ఈసారి ప్రాంతీయపార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తే.. వెనక్కు తగ్గేలా ఉండొద్దనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ఓ కొత్త టీమ్ ను ఇందుకోసం ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ ముంబయి పర్యటనలో ఎవరూ ఊహించని విధంగా.. అక్కడ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యక్షమవ్వడం కూడా ఇందులో భాగమేనని సమాచారం. ప్రకాశ్ రాజ్ కి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమాలే.. కాదు.. రాజకీయాలపైనా.. ఎప్పటికప్పుడు తనదైన విమర్శలతో వార్తల్లో నిలుస్తారు ప్రకాశ్ రాజ్. అయితే ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తే.. పార్టీకి జాతీయ స్థాయిలో ఎంతో ఉపయోగమనే టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై అవగాహన, ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషలపై ప్రకాశ్ కి పట్టు ఉంది. ఇది జాతీయస్థాయి రాజకీయాలకు కలిసొచ్చే అంశమని కేసీఆర్ భావిస్తున్నట్టు ఉన్నారు. కేసీఆర్ టీమ్ లో ప్రకాశ్ రాజ్ కి చోటు కల్పిస్తారనే ప్రచారం సాగుతుంది. అంతేకాదు.. వీలు దొరికినప్పుడల్లా.. కేసీఆర్ ప్రభుత్వాన్ని.. ప్రకాశ్ పొగుడుతుంటారు. కేసీఆర్ డైనమిక్ లీడర్ అంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఇది కూడా ఆయనకు కలిసొచ్చే అంశమే.

అయితే త్వరలో.. 3 రాజ్యసభ స్థానాలకు.. ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అందులో ఒక స్థానాన్ని ప్రకాశ్ రాజ్ కు ఇచ్చే అవకాశం ఉంది. బండ ప్రకాశ్‌ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉంది. జూన్‌లో డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీకాలం ముగుస్తుంది. ఎలాగూ.. మూడు స్థానాలు టీఆర్ఎస్ కే దక్కుతాయి. ఇందులో ఒకటి... ప్రకాశ్ రాజ్ కే అన్నట్టు చర్చలు నడుస్తున్నాయి.

బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు, తన మిత్రురాలు గౌరీ లంకేశ్ హత్య నుంచి ప్రకాశ్ రాజ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. బీజేపీపై సమయం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ రాజకీయాలపై సరైన అవగాహన ఉండటంతో ప్రకాశ్ రాజ్ ని రాజ్యసభకు పంపిస్తే.. ఎంతో ఉపయోగమని గులాబీ బాస్ అనుకుంటున్నట్టు సమాచారం.

మరోవైపు స్టాలిన్ తోనూ.. ప్రకాశ్ రాజ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. సెక్యులరిజం భావజాలం ఉన్న ప్రకాశ్ రాజ్.. ఇతర పార్టీలతోనూ.. మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. స్టాలిన్ కూడా దగ్గర అవడంతో.. ప్రకాశ్ రాజ్ పాత్ర ముఖ్యంగా ఉండనుంది అర్థమవుతోంది. కేసీఆర్ పర్యటనలో ప్రకాశ్ రాజ్ ఉండటంతో ఆయనది కీ రోల్ ఉంటుందని.. అందరికీ అర్థమైంది. ఇక కొన్ని రోజులు వెయిట్ చేస్తే.. అన్ని విషయాలూ.. అర్థమైపోతాయి.

IPL_Entry_Point