Telugu News  /  Telangana  /  Weather Updates Of Telangana Over Imd Issued Rain Aler
తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన (metcentrehyd)

Rains in Telangana: మరో 3 రోజులు భారీ వర్షాలు - ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

10 September 2022, 14:31 ISTHT Telugu Desk
10 September 2022, 14:31 IST

IMD Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Rains in telangana: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... శనివారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్ స్థాయిల వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంకి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

3 రోజులు వర్షాలు - హెచ్చరికలు జారీ

Rains in Telugu States: గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మోసర్తు వర్షాలు కురుస్తుండగా...మరో మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మాల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు ఉరుములు మరియు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ వేగంతో తెలంగాణ రాష్ట్రముపై వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరోవైపు జీహెచ్‌ఎంసి పరిధిలో గత 24గంటల్లో భారీ వర్షం నమోదైంది. తిరుమల గిరిల అత్యధికంగా 61.5మి.మీల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ నెలలో 33.3శాతం వర్షం అధికంగా కురిసింది. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 9వరకు 499.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 665.4 మి.మీ వర్షం నమోదైంది.

ఈ ఏడాది 7 జిల్లాల్లో 60 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. నిర్మల్, నిజమాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, నారాయణపేట్, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మరో 25జిల్లాల్లో 20 నుంచి 59శాతం అదనపు వర్షపాతం నమోదైంది.