Telugu News  /  Telangana  /  Heavy Rains Alert To Hyderabad And Telangana Districts
రాగల 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు
రాగల 24గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

Heavy Rains In Hyderabad : భాగ్య నగరానికి భారీ వర్షాలు....

10 September 2022, 11:24 ISTB.S.Chandra
10 September 2022, 11:24 IST

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. రాగల మూడ్రోజులు నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. శనివారం ఓ మోస్తరు వర్షాలు కురువనుండగా ఆది, సోమవారాల్లో భారీ వర్షం నమోదు కానుంది.

హైదరాబాద్‌లో 5.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా శనివారం 12.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. సంగారెడ్డిలో అత్యధికంగా 91.6మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా నాయ్‌కల్‌లో 91మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మునిపల్లిలో 84.7మి.మీ, రాయ్‌కోడ్‌లో 82.2 మి.మీ, కామారెడ్డి జిల్లా నాగ రెడ్డిపేటలో 78మి.మీ, ఎల్లారెడ్డిలో 72.1మి.మీ, కరీంనగర్‌ జిల్లా గన్నెవరంలో 71.8మి.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా మూతకొండూర్‌లో 69మి.మీ, హతనురాలో 64.8మి.మీ, పెంబిలో 64.3 మి.మీ, సంగారెడ్డి కోహిర్‌లో 63.5 మి.మీల వర్షపాతం నమోదు కానుంది.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. సగటున 15.6 మి.మీ నుంచి 64.4 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. సీజన్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 9 వ తేదీ వరకు సాధారణ వర్షపాతం కంటే 46శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 638.2 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా 929మి.మీ వర్షపాతం నమోదైంది.

జిహెచ్‌ఎంసి పరిధిలో గత 24గంటల్లో భారీ వర్షం నమోదైంది. తిరుమల గిరిల అత్యధికంగా 61.5మి.మీల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ నెలలో 33.3శాతం వర్షం అధికంగా కురిసింది. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 9వరకు 499.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 665.4 మి.మీ వర్షం నమోదైంది.

ఈ ఏడాది 7 జిల్లాల్లో 60శాతం అదనపు వర్షపాతం నమోదైంది. నిర్మల్, నిజమాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, నారాయణపేట్, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మరో 25జిల్లాల్లో 20 నుంచి 59శాతం అదనపు వర్షపాతం నమోదైంది.

ప్రాజెక్టులకు భారీగా వరద నీరు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేత దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 3,56,442 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో : 4,40,991 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా, ప్రస్తుతం : 884.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం: 214.3637 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. సుంకేసుల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 27 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,42,539 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 1,40, 274 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

టాపిక్