Paper Leak: సీఎం కేసీఆర్ తో TSPSC ఛైర్మన్ భేటీ.. కీలక నిర్ణయం ఉంటుందా..?-tspsc chairman meet cm kcr at pragati bhavan over paper leak case issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Chairman Meet Cm Kcr At Pragati Bhavan Over Paper Leak Case Issue

Paper Leak: సీఎం కేసీఆర్ తో TSPSC ఛైర్మన్ భేటీ.. కీలక నిర్ణయం ఉంటుందా..?

HT Telugu Desk HT Telugu
Mar 18, 2023 11:34 AM IST

TSPSC Paper Leak Updates: ముఖ్యమంత్రి కేసీఆర్ తో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR On TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్పీ పేపర్ల లీక్ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిపెట్టారు. శనివారం ఛైర్మన్ జనార్థన్ రెడ్డి... ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావ్ తో పాటు టీఎస్పీఎస్పీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న బోర్డునే రద్దు చేసే అవకాశం సైతం ఉందంటూ లీక్ లు వస్తున్నాయి. ఇక పరీక్షల రద్దు నేపథ్యంలో... రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ నిర్వహణ, పారదర్శకత వంటి పలు అంశాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

పలు పరీక్షలు రద్దు…

శుక్రవారం గ్రూప్ 1 పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పేపర్ లీకేజ్ వ్యవహరంతో ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. అక్టోబర్ 16వ తేదీన 503 పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో 1:50 నిష్పత్తిలో 25, 150 మందిని మెయిన్స్ కు ఎంపిక చేశారు.జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ ను నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనవరి 22వ తేదీన జరిగిన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. మిగతా పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. మరోవైపు జూనియర్ లెక్చరర్ పరీక్షా తేదీలను కూడా రద్దు చేసింది టీఎస్పీఎస్సీ.
ఇప్పటికే ఏఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. 837 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షను రద్దు చేసూ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో పరీక్ష రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ నెల 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏఈ పోస్టులకు మరోసారి రాత పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసింది సిట్. వీరి వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్ విశ్లేషించగా… పై ప్రశ్నాపత్రాలు కూడా లీక్ అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే… పలు పరీక్షలను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం