PM Modi Hyd Visit: మోదీ పర్యటనకు KCR హాజరవుతారా? మళ్లీ అదే సీన్ రీపిట్ అవుతుందా?-telangana cm kcr likely to skip events of pm modi in hyderabad tour ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Cm Kcr Likely To Skip Events Of Pm Modi In Hyderabad Tour

PM Modi Hyd Visit: మోదీ పర్యటనకు KCR హాజరవుతారా? మళ్లీ అదే సీన్ రీపిట్ అవుతుందా?

HT Telugu Desk HT Telugu
Apr 07, 2023 05:40 PM IST

PM Modi - CM KCR: రేపు ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. అయితే ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికేందుకు వస్తారా..? లేదా..? అన్న చర్చ గట్టిగా జరుగుతోంది.

ప్రధాని మోదీ - సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
ప్రధాని మోదీ - సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాబోతున్నారు. శనివారం (ఏప్రిల్ 8) రోజు నగరానికి రానున్న ఆయన... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పీఎంవో నుంచి షెడ్యూల్ విడుదలైంది. గతంలో కూడా పలుసార్లు నగరానికి వచ్చారు ప్రధాని మోదీ. అయితే ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందినప్పటికీ.... స్వాగతం పలికేందుకు రాలేదు. అయితే ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. అయితే ఈసారైనా ప్రధానికి స్వాగతం చెప్పడానికి కేసీఆర్ వెళ్తారా? లేదా,..? అనేది ఆసక్తికరంగా మారింది.

గత కొంతకాలంగా బీజేపీ - బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు కేసీఆర్. సమయం, సందర్భం చూసి విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. ఇదే టైంలో పలుమార్లు ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ కు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ రగడ మొదలైంది. పలు ప్రైవేటు కార్యక్రమాలకు మోదీ హాజరైన క్రమంలో... సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందలేదు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో పీఎంవో కూడా క్లారిటీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేటు కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఉండదని చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య డైగాల్ వార్ నడుస్తూనే ఉంది. అప్పట్నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోదీ టూర్లకు దూరంగానే ఉంటున్నారు. ప్రభుత్వం తరపున మంత్రిని పంపిస్తూ వస్తున్నారు.

ఈసారి కూడా అలాగేనా..?

రేపు హైదరాబాద్ కు ప్రధాని మోదీ రానున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది అధికారిక కార్యక్రమం. ఇందుకోసం కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, గత అనుభవాల దృష్ట్యా... సీఎం కేసీఆర్ మరోసారి దూరంగానే ఉంటారని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే మంత్రి తలసానిని పంపిస్తారని సమాచారం. ఈసారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రధానికి స్వాగతం చెప్పబోతున్నారని తెలుస్తుంది.

మొత్తంగా ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ ఆసక్తికరంగా మారింది. ఇదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో... అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలను మోదీ టార్గెట్ చేస్తారా..? కేవలం అభివృద్ధి వరకు తన ప్రసంగాన్ని పరిమితం చేస్తారా..? అనేది చూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం