Punjab CM Telangana Tour: తెలంగాణలో పంజాబ్ సీఎం టూర్ - షెడ్యూల్ ఇదే-punjab cm bhagwant mann to viist telangana check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Punjab Cm Bhagwant Mann To Viist Telangana Check Full Details Are Here

Punjab CM Telangana Tour: తెలంగాణలో పంజాబ్ సీఎం టూర్ - షెడ్యూల్ ఇదే

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 09:57 PM IST

Punjab CM Telangana Tour Updates: Punjab CM Telangana Tour: పంజాబ్ సీఎం తెలంగాణలో పర్యటించనున్నారు. గురువారం సీఎం కేసీఆర్ తో కలిసి సిద్ధిపేట జిల్లాకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది.

పంజాబ్ సీఎంతో తెలంగాణ సీఎం (ఫైల్ ఫొటో)
పంజాబ్ సీఎంతో తెలంగాణ సీఎం (ఫైల్ ఫొటో) (facebook)

Punjab CM Bhagwant Mann Telangana Tour: తెలంగాణలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పర్యటన ఉంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. కొండపోచమ్మ సాగర్ తో పాటు కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్ డాంలను పరిశీలించనున్నారు. సిద్దిపేట జిల్లాతోపాటు, గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలిస్తారు. ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాలను సందర్శించనున్నారు. ముఖ్యమంత్రుల షెడ్యూల్ ఖరారు కావటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటికే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్… యాదాద్రిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. యాదాద్రి ఆలయ పనులను స్వయంగా వీక్షించారు. చేపట్టిన పనుల ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్… దగ్గరుండి వివరించారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కేజ్రీవాల్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతిపై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే.

మరోవైపు సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్... దేశంలో అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలన్నారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్టని, భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. సుమారు 750-800 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో హనుమాన్ జయంతి సందర్భంగా 10 లక్షల మంది భక్తులను అంచనా వేసి, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యాభై వేల మంది ఒకేసారి దీక్ష చేపట్టేలా అత్యంత విశాలమైన దీక్షాపరుల మంటపాన్ని అన్ని హంగులతో నిర్మించాలని దిశానిర్దేశం చేశారు.

IPL_Entry_Point