CM KCR Kondagattu Tour: కొండగట్టుకు మహర్ధశ.. మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ -another 500 crores of funds allocated for kondagattu anjaneya temple renovation ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Another 500 Crores Of Funds Allocated For Kondagattu Anjaneya Temple Renovation

CM KCR Kondagattu Tour: కొండగట్టుకు మహర్ధశ.. మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

Feb 15, 2023, 03:29 PM IST HT Telugu Desk
Feb 15, 2023, 03:29 PM , IST

  • CM KCR Review On Kondagattu Renovation: సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన ముగిసింది. ఉదయమే ప్రత్యేక హెలికాఫ్టర్ లో JNTU చేరుకున్న సీఎం అక్కడి నుండి రోడ్డు మార్గంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకున్నారు. కేసీఆర్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు.

కొండగట్టు అభివృద్ధికి   మరో 500 కోట్లను కేటాయిస్తూ  ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రకటన చేశారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

(1 / 5)

దేశ ఆధ్యాత్మిక వైభవం మరింత ద్విగుణీకృతం అయ్యే దిశగా, సర్వ హంగులతో కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.   దాదాపు 300 ఏండ్ల క్రితం నిర్మితమైన, అత్యంత పురాతనమైన చారిత్రక కొండగట్టు అంజన్న దేవస్థానాన్ని రోజు రోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ కి అనుగుణంగా , ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లేలా  ఆగమశాస్త్ర నియమనిబంధనలకు లోబడి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి చేపట్టాలన్నారు.

(2 / 5)

ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలినడకన ఆలయ పరిసరాల్లో కలియ తిరిగారు సీఎం కేసీఆర్. అనంతరం ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరం లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

(3 / 5)

దేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలన్నారు సీఎం కేసీఆర్. దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు దర్శించుకునేందుకు అనువుగా  నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. సుమారు 750-800 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

(4 / 5)

కొండగట్టుపై ఉన్న కోనేరు, సీతమ్మ కన్నీటిధార, బేతాళస్వామి ఆలయం కొత్త పుష్కరిణి, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాల గురించి సీఎం… అధికారులతో చర్చించారు. పెరుగుతున్న హనుమాన్ భక్తులను దృష్టిలో ఉంచుకొని గొప్పగా ఈ దేవాలయాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆగమ శాస్త్రం, వాస్తు నియమాలను అనుసరించి  అంజన్న ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను చేపట్టాలని పేర్కొన్నారు. భక్తులు గుడికి చేరుకునే రోడ్డు, తిరిగి గుడి నుండి బయటకు వెళ్ళే రోడ్డును వీలయినంత విశాలంగా నిర్మించాలని, క్యూలైన్ల నిర్మాణం, ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు, విశాలమైన ప్రధాన ద్వారం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు