EV Charge Station in Hyd: లయన్ ఛార్జ్ తొలి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం-lion charge established first ev charging station at jubilee hills in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Lion Charge Established First Ev Charging Station At Jubilee Hills In Hyderabad

EV Charge Station in Hyd: లయన్ ఛార్జ్ తొలి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Sep 10, 2022 05:06 PM IST

lion charge first ev charging station : హైదరాబాద్‌లో తమ మొట్టమొదటి ఈవీ చార్జింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ప్రారంభించింది లయన్‌ చార్జ్‌. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఛార్జింగ్ స్టేషన్ ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ (HT)

lion charge first ev charging station at jubilee hills:లయన్ ఛార్జీ సంస్థ తన దేశంలోనే తన మొట్టమొదటి ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమైన వాణిజ్య ప్రాంతంగా పేరున్న జూబ్లీహిల్స్ లో మొట్టమొదటి ఈవీ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు లయన్ ఛార్జీ సంస్థ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ స్టేషన్ వద్ద వాహనదారులు 50 కిలోవాట్‌ వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. తమ కారు చార్జ్‌ అయ్యేలోపు వినియోగదారుడు ఆహ్లాదకరమైన లాంజ్‌లో సేద తీరుతూ కాఫీనీ సేవించవచ్చు. ఈవీ చార్జింగ్‌ హబ్‌లో 5 చార్జర్లు ఉన్నాయి. ఇవి అన్ని రకాల నాలుగు చక్రాల వాహనాలు , మూడు చక్రాలు, ద్విచక్రవాహనాలకు సపోర్ట్ చేస్తాయి. ఈ ఈవీ చార్జింగ్‌ హబ్‌లో 50 కిలోవాట్‌ డీసీ చార్జర్‌ ఉంది. 50 నిమిషాలలోపే పూర్తిగా చార్జ్‌ చేస్తుంది. ఈవీ చార్జింగ్‌ హబ్‌లో 43 కిలోవాట్‌ ఏసీ చార్జర్‌, 15 కిలోవాట్‌ జీబీ/టీ చార్జర్‌ మరియు మూడు 3కిలోవాట్‌ ఏసీ చార్జర్లు సైతం ఉన్నాయి.

ఈ చార్జింగ్‌ కేంద్రం, ఈవీ ప్రియులకు ఓ అవగాహన వేదికగా పనిచేయనుంది. ఈవీ విప్లవం, వాటి పనితీరు, బ్యాటరీ సాంకేతికతలను గురించి మరింతగా వాహనదారులు తెలుసుకోవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం ప్రారంభించడానికి ప్రధాన కారణం వినియోగదారులకు అవగాహన మెరుగుపరచడం మరియు ఈవీ చార్జింగ్‌ పట్ల ఉన్న అపోహలను పోగొట్టడమే అని సంస్థ పేర్కొంది.

ఈ ప్లాట్‌ఫామ్‌ యువ ఔత్సాహికవేత్తలకు మీటప్‌ కేంద్రంగా నిలువడంతో పాటుగా వారి ఆలోచనలను పంచుకునే వేదికగా కూడా నిలుస్తుందని అని లయన్‌ చార్జ్‌ ఫౌండర్‌, సీఈఓ – మేనేజింగ్‌ డైరెక్టర్‌, గుత్తా వెంకట సాయివీర్‌ రెడ్డి తెలిపారు.

నగరంలో మరిన్ని…

electric vehicle charging stations in hyderabad: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రధాన కార్ పార్కింగ్ వద్ద EV (ఎలక్ట్రిక్ వెహికల్) ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సెంటర్‌లో బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభమైంది. ఈ సేవను పొందాలనుకునే EV వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుంది. 30 KWతో ఒక గంటలో వాహనాన్ని జీరో నుంచి ఫుల్ ఛార్జ్ చేయగలదు. ఛార్జింగ్ స్టేషన్ యాప్ ఆధారితమైనది. Android, IOS యాప్ మొబైల్ పరికరాల ద్వారా ఉపయోగించొచ్చు. మొట్టమొదటిసారిగా GHIAL విమానాశ్రయంలో బయో-డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది.

ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదన వచ్చిన విషయం తెలిసిందే. భాగ్యనగరంలో 300 పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో నిర్వహిస్తారు. ఛార్జింగ్ ఖర్చు.. 18 kilowatt per hour (kWh) గా నిర్ణయించారు. అయితే అవసరాన్ని బట్టి.. ధరలు సవరిస్తారని.. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TSREDCO) అధికారి గతంలోనే చెప్పారు.

ఇందిరా పార్క్, KBR పార్క్ గేట్ 1, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్ సమీపంలో), ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం వంటి అనేక ప్రదేశాలలో ఈ EV ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. అవసరం అయితే.. మళ్లీ సంఖ్యను పెంచుతారు. GHMC, TSREDCO పరస్పరం అంగీకరంతో ఆదాయాన్ని పంచుకుంటాయి.

ప్రస్తుతం, నగరంలో దాదాపు 150 EV ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంక్‌లు మొదలైన వాటికి సమీపంలో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ అవేర్‌నెస్ వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించింది.

ఇందిరా పార్క్, KBR పార్క్ గేట్-1, గేట్-3, గేట్-6, ట్యాంక్ బండ్ రోడ్, మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్స్, అబిడ్స్, నానక్ రామ్ గూడ, మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్, వనస్థలిపురం, ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్దగ్గర), తాజ్ త్రిస్టార్ హోటల్ దగ్గర, SD రోడ్ (సికింద్రాబాద్)లాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం