Electric Vehicles : హైదరాబాద్‌కు 300 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. గంటకు ఎంతంటే?-300 electric vehicle charging stations to come up in hyderabad know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Electric Vehicles : హైదరాబాద్‌కు 300 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. గంటకు ఎంతంటే?

Electric Vehicles : హైదరాబాద్‌కు 300 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. గంటకు ఎంతంటే?

HT Telugu Desk HT Telugu
Jun 23, 2022 02:18 PM IST

హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు వాడేలా ప్రోత్సహించేందుకు ఉపయోగపడనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. భాగ్యనగరంలో 300 పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో నిర్వహిస్తారు. ఛార్జింగ్ ఖర్చు.. 18 kilowatt per hour (kWh) గా నిర్ణయించారు. అయితే అవసరాన్ని బట్టి.. ధరలు సవరిస్తారని.. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(TSREDCO) అధికారి తెలిపారు.

ఇందిరా పార్క్, KBR పార్క్ గేట్ 1, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్ సమీపంలో), ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం వంటి అనేక ప్రదేశాలలో ఈ EV ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.

GHMC అధికార పరిధిలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను త్వరలో GHMC స్టాండింగ్ కమిటీ ముందు ఉంచనున్నట్టుగా GHMC అధికారి ఒకరు తెలిపారు. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. అవసరం అయితే.. మళ్లీ సంఖ్యను పెంచుతారు. GHMC, TSREDCO పరస్పరం అంగీకరంతో ఆదాయాన్ని పంచుకుంటాయి.

ప్రస్తుతం, నగరంలో దాదాపు 150 EV ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంక్‌లు మొదలైన వాటికి సమీపంలో ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల ఎలక్ట్రిక్ మొబిలిటీ అవేర్‌నెస్ వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించింది.

ఇందిరా పార్క్, KBR పార్క్ గేట్-1, గేట్-3, గేట్-6, ట్యాంక్ బండ్ రోడ్, మున్సిపల్ పార్కింగ్ కాంప్లెక్స్, అబిడ్స్, నానక్ రామ్ గూడ, మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్, వనస్థలిపురం, ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతం, సంతోష్ నగర్ (ఒవైసీ హాస్పిటల్దగ్గర), తాజ్ త్రిస్టార్ హోటల్ దగ్గర, SD రోడ్ (సికింద్రాబాద్)లాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

IPL_Entry_Point

టాపిక్