Hyderabad Traffic Police : ఆపరేషన్​ రోప్.. ఎంతమందికి ఫైన్ వేశారంటే?-hyderabad traffic police concentrate on operation rope
Telugu News  /  Telangana  /  Hyderabad Traffic Police Concentrate On Operation Rope
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Twitter)

Hyderabad Traffic Police : ఆపరేషన్​ రోప్.. ఎంతమందికి ఫైన్ వేశారంటే?

06 October 2022, 16:32 ISTHT Telugu Desk
06 October 2022, 16:32 IST

Hyderabad Traffic Police : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్‌ను ముమ్మరం చేశారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు(Hyderabad Traffic Police)లకు చెందిన సుమారు 25 ట్రాఫిక్ యూనిట్లు నగరవ్యాప్తంగా డ్రైవ్ నిర్వహించారు. ROPE ఆపరేషన్‌లో భాగంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 472 మంది వాహనదారులపై చర్యలు తీసుకున్నారు. అలాగే 18 మంది మిగతా నిబంధనలు అతిక్రమించిన వారిపై కలిపి..రూ.3,65,000 జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం-45 జంక్షన్‌లో హైదరాబాద్‌(Hyderabad) కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ పర్యటనలో, ఫీల్డ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారా లేదా అని కూడా చూశారు.

స్థానిక రోడ్లపై ఇన్‌ఫ్లో, వాల్యూమ్‌లు, లోడ్ గురించి ట్రాఫిక్(Traffic) అధికారులు పోలీసు కమిషనర్‌కు వివరించారు. వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ జామ్‌ల తీవ్ర పరిస్థితి నెలకొందన్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో పౌరులు అర్థం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ వాసులు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు.

రోడ్లపై రద్దీని తగ్గించేందుకు, ఆక్రమణలు, అడ్డంకిగా ఉన్న పార్కింగ్‌(Parking)లను తొలగించడానికి మేం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించామని కమిషనర్ పేర్కొన్నారు. ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్(Cell Phone) మాట్లాడుతూ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలను చెక్ పెట్టేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని స్పెషల్ డ్రైవ్‌లు ప్రారంభించనున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు.

రెండు రోజులుగా అన్ని కూడళ్లలో నిబంధనలు పాటించే విధంగా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నారు. కూడళ్ల వద్ద స్టాప్‌ లైన్(Stop Line) దాటితే 100 రూపాయలు, ఫ్రీ లెప్ట్‌కు ఆటంకం కల్పిస్తే వెయ్యి రూపాయలు, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు ఫైన్ విధించనున్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు చెబుతున్నారు. నిబంధనలు పాటించని వాహనాదారులు సీసీ కెమెరాలకు చిక్కినా భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.